Guppedantha Manasu: గౌతమ్ ఇచ్చిన 'గిఫ్ట్'కి ఫిదా అయిన వసు.. తెగ సంతోషపడుతున్న రిషీ!

Published : May 07, 2022, 09:09 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Guppedantha Manasu: గౌతమ్ ఇచ్చిన 'గిఫ్ట్'కి ఫిదా అయిన వసు.. తెగ సంతోషపడుతున్న రిషీ!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే మహేంద్ర (Mahendra) ఎందుకు లేనిపోని చిక్కులు పెట్టుకుంటావని రిషి కు ఇండైరెక్ట్గా చెబుతాడు. ఇక ఎన్నడూ లేనిది ఎందుకు? నీకు ఈ బాధ అని అడుగుతాడు. ఇక  ముఖం మీద తలుపు ఎందుకు వేసిందో వసు (Vasu) మాత్రమే చెప్పగలదు అని రిషి అంటాడు.
 

26

ఇక సాక్షి (Sakshi) ని కాదనడానికి కారణం చెప్పగలవా? అని మహేంద్ర అడగగా.. సాక్షిను రిషి తన పాత అడ్మిషన్ తో పోలుస్తాడు. ఆ తర్వాత రిషి.. వసు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుంది అని ఆలోచిస్తాడు. మరోవైపు వసు రిషి (Rishi) సార్ ఎంత ఫీల్ అయి ఉంటారో పాపం అని భాద పడుతూ ఉంటుంది.
 

36

ఒకవైపు రిషి.. వసు (Vasu) నాకు ఏమవుతుంది. తన మనసులో నా స్థానం ఏమిటి? అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత గౌతమ్ నా ప్రేమను ఈ రోజు వసుకు చెప్పేయాలి అనుకుంటున్నాను అని రిషి తో అంటాడు. దాంతో రిషి (Rishi) కూడా చెప్పమని ప్రోత్సాహిస్తాడు. ఇక వసు మనసులో ఏముందో తెలుసుకోవడానికి రిషి అలా అంటాడు.
 

46

ఇక గౌతమ్ (Gautam) వసుకు తను గీసిన బొమ్మ ఇచ్చి.. నీకు ఒక మాట చెప్పాలి అని అంటాడు. వసు ఐ లవ్ యూ అని అంటాడు. దాంతో వసు (Vasu) ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది. ఇక గౌతమ్ నిజం.. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు.
 

56

ఇక కొంచెం దూరం నుంచి అవన్నీ వింటున్న రిషి..  గౌతమ్ (Gautam) ను పంపించి నేను ఏమన్నా తప్పు చేశానా అని అనుకుంటాడు. ఇక రిషి ఆరోజు జరిగిన యాక్సిడెంట్ లో నువ్వు వాళ్ళకి హెల్ప్ చేశావు నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను నిన్నే లవ్ చేయాలని.. అని గౌతమ్ వసు (Vasu) కు చెబుతాడు.
 

66

ఆ తర్వాత వసు (Vasu) ఈ బొమ్మ ఇంత బాగా గీశారు తీసింది ఎవరు అని అడుగుతుంది. ఇక గౌతమ్ ఈ బొమ్మ గీసింది ఎవరో తెలుసుకో అని అంటాడు. తర్వాత గౌతమ్ (Gautam) వసు మనసులో ఎవరో ఉన్నారని రిషి కి చెబుతాడు. ఆ మాటతో రిషి ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాడు.

click me!

Recommended Stories