లేడీ వపర్ స్టార్ నయనతార - విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) ఏడాదిన్నర కిందనే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కోలీవుడ్ జంట వివాహానికి సినీ, రాజకీయ నాయకులు హాజరై విష్ చేశారు.
‘నేనూ రౌడీనే’ చిత్రంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఏడేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలారు. 2022 జూన్ 9న మహాబలిపురంలో గ్రాండ్ గా వీరి వెడ్డింగ్ జరిగింది.. వీరు ఇద్దరు ట్విన్స్ కు కూడా జన్మనిచ్చారు.
నయనతార సరోగసీ ద్వారా ట్విన్స్ కు జన్మినిచ్చారు. వారికి ఉయిర్, ఉలగ్ అని నామకరణం కూడా చేశారు. ఇక ఇప్పటికే తన ట్విన్స్ ఫస్ట్ బర్త్ డే కూడా గ్రాండ్ గా జరిగింది.
చాలా రోజుల తర్వాత మళ్లీ కొడుకులతో నయనతార కనిపించింది. ఈరోజు వాలెంటైన్స్ డే (Valentines Day) సందర్భంగా భర్త, కొడుకులతో కలిసి ఇంట్లోనే సమయం గడిపింది.
భర్తకు వామ్ హగ్ ఇస్తూ ఫొటోకు ఫోజులిచ్చింది. అలాగే పిల్లలను ముద్దాడుతూ ఈ వాలెంటైన్స్ డేకు పిల్లతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారింది.
పిల్లలతో కలిసి లేడీ సూపర్ స్టార్ నయనతార సంతోషంగా కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక నయన్ చివరిగా ‘జవాన్’ చిత్రంతో సక్సెస్ అందుకుంది. నెక్ట్స్ మూవీ కోసం ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.