రష్మి గౌతమ్ కెరీర్ రెండు దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. కానీ ఆమెకి జబర్దస్త్ షో గుర్తింపు తెచ్చింది. అదే అందరికి తెలిసేలా చేసింది. దీంతో ఆమెకి సంబంధించిన సినిమాలు సైతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. అందులో భాగంగా రష్మి నటించిన ఓ సినిమా ట్రెండ్ అయ్యిందట. ఆ మూవీని అలా చూసిన షాక్ అయ్యిందట. ఆ విషయాన్ని బయటపెట్టింది రష్మి.
తాజాగా రష్మి ఐడ్రీమ్ యూట్యూబ్ ఛానెల్‌తో ముచ్చటించింది. ఇందులో తన గతంతోపాటు అనేక విషయాలను షేర్ చేసుకుంది. తన కెరీర్ ఎప్పుడు ప్రారంభమైందో వెల్లడించింది. అందులో మాట్లాడుతూ తన నాన్నది ఉత్తర ప్రదేశ్ అని, అమ్మది ఒరిస్సా అని పేర్కొంది. తనకు తెలుగు పెద్దగా రాదని వెళ్లడించింది. 2002లో ఆ టైమ్‌లో తాను తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందట. మొదట ఒకటి రెండు సినిమాలు చేసిందట.
ఫస్ట్ ఆమె `థ్యాంక్స్` అనే సినిమాలో నటించినట్టు చెప్పింది. అందులో వినిత్, శ్రీనాథ్ హీరోలుగా నటించారు. ఇది పక్కా కమర్షియల్ మూవీ అని, ఆరు పాటలు ఉంటాయని, అందులో ఒక రొమాంటిక్ సాంగ్, డ్యూయెట్ సాంగులు కూడా ఉన్నాయని తెలిపింది. పాట కాస్త హాట్‌గానే ఉంటుంది. అయితే కథ బాగానే ఉందని, కానీ సినిమా ఆడలేదని, పెద్దగా ప్రమోట్ చేయలేదని చెప్పింది. దీంతో ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో తెలియకుండా వచ్చిపోయిందని చెప్పింది.
అయితే జబర్దస్త్ షోలోకి వచ్చాక పాపులారిటీ రావడంతో ఇప్పుడు తన గత చిత్రాలను యూట్యూబ్‌లో ట్రెండ్ చేస్తున్నారని తెలిపింది. అయితే థంబ్ నెయిల్స్ మాత్రం దారుణంగా పెడుతున్నారట. ఓ చోట రష్మి హాట్ సాంగ్స్ చూశారా అని పెట్టారట. మరోసారి చూసతే `రష్మి పోర్న్ మూవీ` అని థంబ్ నెయిల్ పెట్టారట. అది చూసి తాను షాక్ తిన్నానని, చాలా హర్ట్ అయినట్టు చెప్పింది. బ్రో సినిమా ఏంటి మీరు పెట్టిందేంటి అని ఆశ్చర్యపోయిందట. ఒకసారి సినిమా చూడండి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వ్యూస్ కోసం అలా పెడుతున్నారని తెలిపింది. కానీ అది తనకు చాలా బాధ కలిగించిందని పేర్కొంది.
అయితే సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వస్తుంటాయని, అన్నీ అందరికి నచ్చాలని లేదని, బోల్డ్ సీన్లు చేస్తే కొందరికి నచ్చుతాయి. ఫ్యామిలీ సీన్లు చేస్తే కొందరికి నచ్చుతాయి. అందరికి అన్నీ నచ్చవు. ఒక్కో మూవీ ఒక్కోలా చేసుకుంటూ వెళ్లాలి. అదే సమయంలో కామెంట్లని అస్సలు పట్టించుకోకూడదు, పట్టించుకుంటే హెడ్ కరాబ్ అయిపోతుందని, మన పని మనం చేసుకుంటూ వెళ్లాలని తెలిపింది.
తన కెరీర్ 2002-03 సమయంలో స్టార్ట్ అయ్యిందని మొదటి సినిమాలు చేసినట్టు తెలిపింది. అవి పెద్దగా ఆడలేదని, ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నట్టు తెలుసింది. అట్నుంచి బుల్లితెరపైకి వచ్చిందట. ఇక్కడ బాగుందని చెప్పింది. మళ్లీ మధ్యలో సినిమాలు చేసే రకరకాల వల్గర్ కామెంట్లని ఫేస్ చేసిందట. దీంతో సినిమా కంటే టీవీనే బెటర్ అని ఫిక్స్ అయ్యిందట. అందుకే సినిమాలకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదని తెలిపింది రష్మి గౌతమ్.
ప్రస్తుతం ఆమె `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలకు యాంకర్‌గా చేస్తుంది రష్మి. ఇక ప్రారంభంలో రష్మి.. `థ్యాంక్స్`తోపాటు `అంతం`, `అంతకు మించి`, `గుంటూరు కారం`, `చారుశీల`, `రాణిగారి బంగళా` ఇటీవల `బొమ్మ బ్లాక్ బస్టర్` మూవీస్ చేసింది. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెరిసింది. ఇటీవల `భోళా శంకర్` ఐటెమ్ సాంగ్‌లో మెరిసిన విషయం తెలిసిందే.