‘డీజే టిల్లు’కు సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ (Tiilu Square) రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ Jonnalagadda - అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు.
వాలెంటైన్స్ డే (Valentines Day) సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ‘డీజే టిల్లు’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్ధూ జొన్నలగడ్డ సీక్వెల్ తోనూ మంచి ఫలితాన్ని అందుకోబోతున్నారని కనిపిస్తోంది.
ట్రైలర్ ను గమనిస్తే.. టిల్లు కాస్తా రిచ్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే తను రాధిక చేసిన మోసం నుంచి తేరుకోలేక ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అమ్మాయి మోసం చేసినా... అమ్మాయిల వెంట మాత్రం తిరగడం మానడం లేదనేది అర్థం అవుతోంది.
అమ్మాయిల సోకు ఉన్న టిల్లు మరోసారి అనుపమాతో లవ్ లో పడుతాడు. ఈసారి తెలిసి మరి బొందలో పడట్టుగా టిల్లు స్టోరీ కనిపిస్తోంది. మొదటి పార్ట్ లాగే సీక్వెల్ లోనూ అమ్మాయిలో ప్రేమలో పడి.. తన ఎఫైర్ లు తెలుసుకొని.. అలోపే ఓ ట్రాప్ లో చిక్కుకొని బయటపడే కథలా కనిపిస్తోంది.
కానీ... మొదటి పార్ట్ కు రెండో పార్ట్ కు కూడా కాస్తా లింక్ పెట్టారు. హాస్పిటల్ లోని సీన్ కు సీక్వెల్ కు లింకు ఉందని తెలుస్తోంది. అక్కడి నుంచే అప్పుడు కథ మారినట్టు.. ఇందులోనే అలాగే ఓ ట్విస్ట్ ఉండబోతుందనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఇక అనపమా పరమేశ్వరన్ బోల్డ్ సీన్లతో రెచ్చిపోయేలా కనిపిస్తోంది. ట్రైలర్ లో డీప్ లిప్ లాక్ తో షాకిచ్చింది. ఇక డైలాగ్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి... ‘గుడ్ సె**క్స్ కాదు.. సె**క్స్ అంటేనే గుడ్’ అనే డైలాగ్స్ యూత్ ను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఇక టిల్లు స్టైల్, డైలాగ్స్, కామెడీ, రొమాన్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మార్చి 29న చిత్రం విడుదల కానుంది.