1000 కోట్లు వసూలు చేసిన ఫస్ట్ హీరోయిన్, నయనతార టాప్ 10 మూవీస్..

Published : Nov 18, 2025, 10:34 AM IST

Nayanthara Top 10 Highest Grossing Films : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  20 ఏళ్లకు పైగా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న నటి నయనతార.  41వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ సీనియర్ తార.. టాప్ 10 సినిమాలు, రికార్డ్స్ ఏంటో తెలుసా? 

PREV
15
నయనతార టాప్ 10 మూవీస్..

హరి దర్శకత్వంలో వచ్చిన 'అయ్యా' సినిమాతో నయనతార ఫిల్మ్  ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమె మొదటి సినిమానే బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. అందులో ఒక  పాట వైరల్ అవ్వడంతో వరుస అవకాశాలు వచ్చాయి. 'అయ్యా' తర్వాత 'చంద్రముఖి' రూపంలో జాక్‌పాట్ కొట్టింది నయన్. ఆ తర్వాత వరుసగా  విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, ధనుష్, చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, ఎన్టీఆర్, ప్రభాస్, శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోలతో నటిస్తూ టాప్ హీరోయిన్‌గా మెరిసింది.

25
తెలుగులో వరుస అవకాశాలు..

నయనతార తమిళంలో కెరీర్ స్టార్ట్ చేసి.. తెలుగు,  హిందీ, మలయాళం భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా వెలుగుతోంది. 41 ఏళ్ల వయసులోనూ ఫిట్ గా ఉంటూ గ్లామర్ ను కాపాడుకుంటూ.. యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. దాంతో ఆమెకు వరుసగా  అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో బిజీగా ఉంది నయనతార. 

35
అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా '

నయనతార కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా 'జవాన్'. షారుఖ్‌కు జోడీగా నటించిన ఈ సినిమా 1152 కోట్లు వసూలు చేసింది. 1000 కోట్లు వసూలు చేసిన తొలి తమిళ హీరోయిన్ గా నయనతర రికార్డు సాధించింది. రెండో స్థానంలో 'బిగిల్' ఉంది. అట్లీ దర్శకత్వంలో విజయ్‌తో నటించిన ఈ సినిమా 304 కోట్లు రాబట్టింది.

45
మూడో స్థానంలో తెలుగు సినిమా

మూడవ స్థానంలో చిరంజీవి నటించిన  తెలుగు చిత్రం సైరా నరసింహ రెడ్డి ఉంది. ఈ సినిమా 248 కోట్లు వసూలు చేసింది. నాల్గవ స్థానంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నయనతార నటించిన దర్బార్ ఉంది. ఈ మూవీ 238 కోట్లు వసూలు చేసింది. దీని తరువాత, అజిత్ నటించిన విశ్వాసం 187 కోట్లతో ఐదవ స్థానంలో ఉంది. అన్నత్తే చిత్రం ఆరవ స్థానంలో నిలిచింది. ఈ సినిమా 171 కోట్లు వసూలు చేసింది.

55
స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు

7వ స్థానంలో చిరంజీవితో కలిసి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఉంది. మోహన్ రాజా దర్శకత్వంలో నయనతార నటించిన ఈ తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 108 కోట్లు వసూలు చేసింది. 8వ స్థానంలో అజిత్ సరసన నయనతార నటించిన 'ఆరంభం' సినిమా ఉంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 101 కోట్లు వసూలు చేసింది. 9వ స్థానంలో విక్రమ్ తో కలిసి నయన్ నటించిన 'ఇరుముగన్' సినిమా ఉంది. దాని కలెక్షన్ 94 కోట్లు. 10వ స్థానంలో నయనతార నటించిన 'చంద్రముఖి' సినిమా ఉంది. ఆ సినిమా 89 కోట్లు వసూలు చేసింది. ఇలా టాప్ హీరోలతో భారీ కలెక్షన్ల సినిమాలు చేసింది లేడీ సూపర్ స్టార్. 

Read more Photos on
click me!

Recommended Stories