Illu Illalu Pillalu Today Episode Nov18: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ధీరజ్ రామరాజు మధ్య ప్రేమ ఉద్యోగం పై ఆసక్తికరమైన వాదన జరుగుతుంది. రామరాజు ప్రేమ జాబ్ చేయడానికి వీలు లేదని చెబుతాడు. కానీ ధీరజ్ మాత్రం అందుకు ఒప్పుకోడు.
గురుమూర్తి వల్ల ధీరజ్, రామరాజు మధ్య గొడవ మొదలవుతుంది. ఇంటికి వచ్చిన రామరాజు ధీరజ్ ను ప్రేమ జాబ్ విషయంలో నిలదీస్తాడు. మధ్యలో వల్లి దూరి రామరాజు కోపాన్ని మరింత పెంచేస్తుంది. ప్రేమ ఉద్యోగం చేస్తే ఎదురింటి వారు వచ్చి గొడవ పెడతారని మరొకసారి మామయ్య గారి షర్టు చింపేస్తారని అంటుంది. ప్రేమ ఉద్యోగం చేస్తే మామయ్య గారికి సిగ్గులేదా అని అడుగుతారని మరింత రెచ్చగొడుతుంది. దీంతో ధీరజ్ వల్లిని ఆపుతాడు. ఎందుకలా అంటారు వదినా అని ప్రశ్నిస్తాడు. రామరాజు కల్పించుకొని వేదవతి తో మీ వాళ్ల గురించి నీకు తెలియదా? నర్మదని అడ్డుపెట్టుకొని నా మీద మొన్న గొడవ పడ్డారు. నేనే ఆస్తులు సీజ్ చేయించాను అని అన్నారు.. కాబట్టి ప్రేమా పోలీస్ అవ్వడానికి వీల్లేదు. అని చెప్పేస్తాడు
25
వల్లి ఆనందం
ధీరజ్ మాత్రం తొలిసారి తన తండ్రితో వాదనకు దిగుతాడు. సారీ నాన్న ప్రేమ పోలీస్ అవ్వాలని కోరుకుంటోంది.. నేను నా బాధ్యత నెరవేర్చుతాను, ప్రేమను పోలీస్ చేసి తీరుతాను అని అంటాడు. కానీ రామరాజు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నన్నే ఎదిరిస్తావా? నా మాట కాదంటే నా నిర్ణయాలు కఠినంగా ఉంటాయి అంటూ చాలా సీరియస్ అవుతాడు. ఈ గొడవ అంతా చూసిన వల్లి ఆనందం పట్టలేక పోతుంది. నా కడుపు నిండిపోయింది.. కళ్ళు చల్లబడ్డాయి అనుకుంటూ తన పుట్టింటికి పాటలు పాడుకుంటూ బయలుదేరుతుంది. అందులోనూ బుల్లెట్ బండి ఎక్కి మరీ వెళుతుంది. ఇడ్లీ బాబాయ్ తన కూతురుని చేసి గెంతులేస్తాడు. బుల్లెట్ మీద కూతురు వచ్చిందంటే నా దశ మార్చడానికే అని అనుకుంటాడు. శ్రీవల్లి కూడా తల్లిదండ్రులతో కలిసి డాన్స్ చేస్తుంది. అత్తారింట్లో ఏం జరిగిందో అంతా తల్లిదండ్రులకి చెబుతుంది. ఇంకా ఆనందం పట్టలేక అందరూ గంతులు వేస్తారు.
35
బాధపడిన ప్రేమ
ప్రేమ మాత్రం రామరాజు మాటలు తలుచుకొని చాలా బాధపడుతుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. ధీరజ్ ను ఎందుకు మీ నాన్నకు ఎదురు తిరిగావు, గొడవపడ్డావు అని ప్రశ్నిస్తుంది. దానికి నీ కలను నేను నిజం చేస్తాను అనడంలో తప్పేముంది, అది ఆయన అర్థం చేసుకోవాలి, రేపు ఏదో జరుగుతుంది అని ఈరోజు నిన్ను ఆపడం ఏంటి? అని అంటాడు. దానికి ప్రేమ ‘నావల్ల నీకు మామయ్యకి గొడవ జరిగితే నాకు చాలా బాధేస్తుంది. నాకు పోలీస్ జాబ్ వద్దు’ అని అంటుంది. దానికి నువ్వు పోలీస్ కాకపోతే నేను ఓడిపోయినట్లే భార్య కలను నిజం చేయడం నా బాధ్యత అంటాడు ధీరజ్.
ధీరజ్ ప్రేమ దగ్గర నుంచి వెళ్లిపోయాక నర్మద అక్కడికి వస్తుంది. నర్మదకు కూడా అదే విషయాన్ని చెబుతుంది ప్రేమ. దానికి నర్మదా ‘నువ్వంటే ధీరజ్ కి ఆకాశమంత ప్రేమ అని చెప్పడానికి ఇదే ఉదాహరణ’ అని అంటుంది. ఇక రాత్రి అయ్యాక రామరాజు కుటుంబమంతా ఆరు బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ సందడిగా సంతోషంగా ఉంటారు. ఇంతలో సేనాపతిని బెయిలు మీద తీసుకొని భద్రావతి ఇంటికి వస్తుంది. భద్రావతి రామరాజు కుటుంబాన్ని చూసి వాళ్ళు వినేలా ‘అన్నింటికీ వడ్డీతో సహా చెల్లిస్తా’ అని గట్టిగా మాట్లాడుతుంది. సేనాపతి ఇంట్లోకి వెళుతూ కూతురిని చూసి నీతో మాట్లాడాలి రామ్మా అని పిలుస్తాడు. వెంటనే ప్రేమ తన తండ్రి దగ్గరికి వెళుతుంది.
55
సేనాపతి ఏడుపు
ప్రేమ సేనాపతి వెంట వెళ్లడం ధీరజ్ చూసి ఆమె వెనకే వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. రామరాజు వెంటనే కొడుకును ఆపుతాడు. ప్రేమ, సేనాపతి దగ్గరకు వెళుతుంది. అప్పుడు సేనాపతి ‘నువ్వు మీ అమ్మ పొట్టలో ఉన్నప్పుడే అడ్డం తిరిగావు. ఆ సమయంలో ప్రసవం అయ్యాక మీ అమ్మ ఆరోగ్యంగా మారడానికి ఏడాది పట్టింది. ఇప్పుడు నువ్వు పొడిచిన వెన్నుపోటుకి అమ్మా నేను కోలుకోవడానికి ఈ జీవితం సరిపోదేమో. నాకు కొడుకు పుట్టినప్పుడు కూడా అంత సంతోషం కలగలేదు.. కానీ కూతురు పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందనుకున్నా. నా సంతోషం నా కూతురే అని ఆనందపడ్డాను. కానీ నువ్వే నాకు శత్రువవుతావని అనుకోలేదు. నువ్వు కన్న తండ్రిని అరెస్ట్ చేయించేంత గొప్ప ఎత్తుకు ఎదిగావు’ అని ఏడుస్తాడు. ప్రేమ కూడా తండ్రి ఏడుపును చూసి తట్టుకోలేక ఏడుస్తుంది. దీనితో ఇవాల్టి ఎపిసోడ్ ముగిసిపోతుంది.