నయనతార టాప్ 10 వివాదాలు , అల్లు అర్జున్, ధనుష్, త్రిష తో గొడవలకు కారణం ఏంటి?

Published : Oct 08, 2025, 07:26 PM IST

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఉన్న నయనతార, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కెరీర్ బిగినింగ్ నుంచి ఏదో ఒక విషయంలో, నయనతార చేసే పనులు వివాదాలకు దారి తీస్తూ వస్తున్నాయి. నయనతార కెరీర్ లో హాట్ టాపిక్ గా మారిన టాప్ 10 వివాదాలు ఏంటి?

PREV
19
ధనుష్ తో వివాదం

తన పెళ్లి డాక్యూమెంటరీ విషయంలో నయనతారకు, ధనుష్ తో విభేదాలు తలెత్తాయి. ఈ విషయంలో వారు కోర్టు వరకూ వెళ్లారు. 2024లో నయనతార తన పెళ్లి వీడియోను “Nayanthara: Beyond the Fairytale” అనే డాక్యుమెంటరీగా చేసి, నెట్‌ఫ్లిక్స్ కి అమ్మేసింది. అయితే ఇందులో నయన్ హీరోయన్ గా నటించిన “Naanum Rowdy Dhaan” (2015) సినిమాలోని కొన్ని సీన్స్ ను వాడుకున్నారు. ఈ సినిమా నిర్మాత స్టార్ హీరో ధనుష్ ను ఈ విషయంలో అనుమతి అడిగినా ఆయన ఒప్పుకోలేదు. అయినా సరే సీన్స్ ను వాడుకోవడంతో, ధనుష్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు నయనతారకు టీమ్ కు లీగన్ నోటీస్ లు కూడా ఇచ్చారు. దాంతో ధనుష్ పై బహిరంగంగానే విమర్షలు చేసిందిన నయన్. ఇక తన అనుమతి లేకుండా సినిమాలో సీన్స్ వాడుకున్నందుకు 10 కోట్లు నష్టపరిహారంగా డిమాండ్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో ధనుష్ కేసు దాఖలు చేశారు. నయనతార ఈ వివాదంపై ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తోంది.

నోటీసులు ఇచ్చిన చంద్రముఖి నిర్మాతలు

నయనతార తన పెళ్లి డాక్యుమెంటరీ విషయంలో మరో కేసు కూడా నడుస్తోంది. ఇందులో తమ అనుమతి లేకుండా సన్నివేశాలు వాడుకున్నారని చంద్రముఖి సినిమా నిర్మాతలు కోర్డు మెట్లు ఎక్కారు. రీసెంట్ గానే ఈ విషయంలో కూడా నయనతారకు నోటీసులు అందాయి. వారు కూడా నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారు.

29
తిరుపతి లో అపచారం

నయన్  విష్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత తిరుపతి శ్రీవారి దర్శనానికి జంటగా వెళ్లారు.  అయితే నయనతార-విఘ్నేష్ శివన్, గుడి దగ్గర చెప్పులతో ఫోటోలు తీసుకోవడంతో వివాదం రేగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నోటీసులు జారీ చేసింది. ఆతరువాత వారు క్షమాపణలు తెలుపుతూ ఓలేఖను కూడా పంపించారు.

39
సరోగసీ వివాదం

నయనతారకు రెండు సార్లు లవ్ ఫెయిల్యూర్ అయ్యింది. ఆతరువాత Naanum Rowdy Dhaan డైరెక్టర్ విష్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి జరిగిన కొన్ని నెలలోనే వీరు సరోగసి ద్వారా కవల పిల్లలను పొందారు. అయితే ఇంత తక్కువ టైమ్ లోనే ఈ జంటకు కవల పిల్లలు జన్మించడంతో వారు సరోగసీ చట్టాలను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. కానీ తమిళనాడు ఆరోగ్య శాఖ విచారణ జరిపి చట్ట ఉల్లంఘనలేవీ లేవని స్పష్టం చేసింది.

49
అల్లు అర్జున్ ను అవమానించిన నయన్ ?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా నయనతారకు ఓ వివాదం ఉంది. అయితే ఈ విషయంలో బన్నీ ఎప్పుడు స్పందించలేదు. కానీ.. నయనతార అల్లు అర్జున్ ను అవమానించారంటూ ఫ్యాన్స్ గతంలో రచ్చ చేశారు. అసలు విషయం ఏంటంటే..? 2016లో ఓ అవార్డు వేడుకలో, నయనతార అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవాల్సి ఉంది. అయితే సరిగ్గా అవార్డు ఇచ్చే టైమ్ కు నయన్ అవార్డు తీసుకోకుండా, అప్పటి తన ప్రియుడు, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ నుంచి ఆ అవార్డును తీసుకోవాలని అనుకుంటున్నట్టు కోరింది. అల్లు అర్జున్ కూడా ఈ విషయంలో కాస్త సీరియస్ గానే కనిపించారు. కానీ ఆయన ఏ కామెంట్లు చేయలేదు. బన్నీ అభిమానులు మాత్రం నయనతారపై గట్టిగా ట్రోల్స్ చేశారు. అప్పట్లో సోషల్ మీడియా వేదికగా ఎన్నో విమర్శలు కూడా చేశారు.

59
త్రిషతో గొడవలు

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నయనతారతో పాటు త్రిష కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో మనస్పర్ధలు ఉన్నట్టు తెలుస్తోంది. ఓ సినిమా విషమంలో వీరిద్దరికి మధ్య గొడవలు వచ్చాయని అంటున్నారు. ఈ విషయంపై ఇద్దరు స్టార్లు ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. సౌత్ లో త్రిష, నయనతా ఇద్దరు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. తెలుగులో ఈ ఇద్దరు హీరోయిన్లు మెగాస్టార్ చిరంజీవి సరసన రెండు సినిమాల్లో నటిస్తున్నారు.

69
మీనా విషయంలో నయనతార ఏం చేసింది ?

ప్రస్తుతం నయనతార నటిస్తున్న సినిమాల్లో మూక్కుత్తి అమ్మన్ 2 కూడా ఒకటి. కుష్బు భర్త సుందర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతోంది. అయితే ఈసినిమా విషయంలో సుందర్ తో నయనతారకు విభేదాలు వచ్చాయని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయాన్ని కుష్బు ఖండించారు. అలాంటివేమి జరగలేదన్నారు. ఇక ఇదే సినిమా ఓపెనింగ్ ఫక్షన్ కు వచ్చిన సీనియర్ హీరోయిన్ మీనాను నయనతార అవమానించినట్టు వార్తలు గుప్పుమన్నాయి. మీనా పక్కన నించున్నా ఆమెతో మాట్లాడలేదు, కనీసం పలకరించలేదు నయనతార. ఈ విషమంలో మీనా కూడా పేర్లు బయటకు చెప్పకుండా, సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తి వ్యక్తం చేశారు.

79
సీతగా నటించడం పై విమర్శలు

నందమూరి బాలకృష్ణ రాముడిగా నటించిన శ్రీరామరాజ్యం చిత్రంలో నయనతార సీతగా నటించి మెప్పించింది. అయితే నయనతార సీతగా నటించడంపై కొన్ని హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. వ్యక్తిగతంగా ఎన్నో వివాదాలకు కారణమైన వ్యక్తి, ఈ పాత్రకు సరిపోదని హిందూ మక్కల్ కచ్చి సంస్థ విమర్శించింది. అప్పట్లో ఈ విషయంపై పెద్ద వివాదమే చెలరేగింది. అంతే కాదు “Annapoorani – The Goddess of Food” అనే సినిమాలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, మాంసాహారం తినే అమ్మాయి పాత్రలో నయనతార కనిపించింది. దాంతో హిందూ సంప్రదాయాలను నయనతార దెబ్బతీసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో కొన్ని కేసులు కూడా నమోదు అవ్వగా.. నెట్ ప్లిక్స్ ఈ సినిమాను తొలగించింది.

89
ప్రభుదేవాతో నయన్ బంధం

2009లో ప్రభుదేవా-నయనతార ప్రేమ వ్యవహారం గట్టిగా వైరల్ అయ్యింది. ‘విల్లు’ సినిమాతో వీరి పరిచయం ప్రేమగా మారింది. 2010లో ప్రభుదేవా వారి బంధం గురించి ఓపెన్ కామెంట్స్ చేశారు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీ అయ్యారు. ప్రభుదేవకు అప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లి తరువాత నయనతారను సినిమాలు వదిలేయమని ప్రభుదేవ కండీషన్ పెట్టాడని కోలీవుడ్ సమాచారం. ఆ కారణంగానే వారి మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి వరకూ వెళ్లిన ప్రేమ బ్రేకప్ అయినట్టు సమాచారం. 

99
శింబుతో ఘాటు ప్రేమ

కెరీర్ బిగినింగ్ లోనే నయనతార అతి పెద్ద వివాదం ఫేస్ చేసింది. అప్పట్లో కోలీవుడ్ లో యమా క్రేజ్ ఉన్న హీరో శింబుతో ప్రేమ వ్యవహారం నడిపించింది నయన్. ఈ విషయంలో పెద్ద దుమారమే రేగింది. 2006లో “వల్లభ” సినిమా సమయంలో శింబుతో నయనతార ప్రేమలో పడింది. సోషల్ మీడియాలో వారి ప్రైవేట్ ఫోటోలు లీక్ కావడంతో అప్పట్లో ఈ విషయం రచ్చ రచ్చ అయ్యింది. ఆతరువాత కాలంలో వీరు విడిపోయి బ్రేకప్ చెప్పుకున్నారు. ఇలా నయనతార లేడీ సూపర్ స్టార్ గా ఎదిగే క్రమంలో ఎన్నో వివాదాలను దాటుకుని ఎదిగారు.

Read more Photos on
click me!

Recommended Stories