ఐబొమ్మ లాంటి పైరసీ, టొరెంట్ వెబ్ సైట్లు నిర్మాతలకు శాపంగా మారాయి. సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయినా, ఓటీటీలో రిలీజ్ అయినా పైరసీ వెబ్ సైట్లు వదిలిపెట్టడం లేదు. వెంటనే ఐబొమ్మ, మూవీ రూల్స్ లాంటి వెబ్ సైట్లలో లీక్ చేసేస్తున్నారు. పైరసీ ప్రభావం వల్ల నిర్మాతలు నష్టపోవాల్సి వస్తోంది. తాజాగా నయనతారకి పెద్ద షాక్ తగిలింది.