నయనతార పిల్లల పుట్టిన రోజు.. తొలిసారిగా ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తూ.. లేడీ సూపర్ స్టార్ ఎమోషనల్ నోట్

First Published | Sep 27, 2023, 11:13 AM IST

ఈవేళ లేడీ సూపర్ స్టార్ నయనతార కవల పిల్లలు పుట్టిన రోజు. ఈ సందర్భంగా అరుదైన చిత్రాలను పంచుకుంది. ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చింది.
 

నయనతార - విఘ్నేశ్ శివన్ గేతేడాది పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే.  ‘నేనూ రౌడీనే’ చిత్రంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఏడేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలారు. 2022 జూన్ 9న మహాబలిపురంలో గ్రాండ్ గా వీరి వెడ్డి జరిగింది.
 

వీరి పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై ఆశీర్వదించిన విషయం తెలిసిందే. ఆ కొద్ది నెలలకే అక్టోబర్ 22లోనే సరోగసీ ద్వారా ట్విన్స్ కు జన్మనిచ్చారు. నయనతార ఇద్దరు కవలలకు తల్లిగా మారడంతో అభిమానులు కూడా సంతోషించారు.
 


అప్పటి నుంచి నయనతార ఎక్కువ సమయం తన పిల్లలను చూసుకునేందుకే కేటాయించింది. ట్విన్స్ కు ఉయిర్, ఉలగ్ అని నామకరణం కూడా చేశారు. ఇక తన ట్విన్స్ ఫస్ట్ బర్త్ డే రానే వచ్చేసింది. ఈరోజు పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. 
 

ఈ సందర్భంగా నయనతార కొన్ని అరుదైన చిత్రాలను అభిమానులతో పంచుకుంది. ఎప్పటి నుంచో తమ ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేయాలనుకుంటున్నట్టుగా తెలిపింది. ఆ సమయం ఇప్పుడు వచ్చిందంటూ.. తన పిల్లలకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ అరుదైన చిత్రాలను షేర్ చేసింది. 
 

రూపంలో, గుణంలో చక్కనైనా వారంటూ కొడుకులను ఆకాశానికి ఎత్తింది. తమ పిల్లల్ని మాటల్లో చెప్పలేనంత ప్రేమిస్తున్నామని, జీవితంలో అన్నింటికి మించిన ఆనందం వారేనంటూ వర్ణించింది. ఇద్దరికీ ఓకే మాదిరి డ్రెస్ వేసి క్యూట్ గా రెడీ చేశారు. ఫ్యామిలీ ఫొటోలకు ఫోజులిచ్చారు.

ఇక తమ జీవితంలోకి వచ్చినందుకు, చాలా సంతోషపరిచినందుకు ధన్యవాదాలు అంటూ ఉయిర్, ఉలగ్ ను మరోసారి విష్ చేసింది. జీవితంలో అన్ని సానుకూలతలు ఉండాలని, అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంది. గడిచిన ఏడాది సమయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొంది. చివరిగా ‘జవాన్’తో అలరించింది నయనతార. ఈ చిత్రంతో రూ.1000 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది.

Latest Videos

click me!