బీచ్ లో రత్తాలు రచ్చ.. ఇలా దర్శనమిస్తే ఇంటర్నెట్ లో హీట్ తగ్గేదెలా.. రాయ్ లక్ష్మి స్టిల్స్..

First Published | Sep 27, 2023, 10:26 AM IST

నటి రాయ్ లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ..  తన వెకేషన్ నుంచి ఘాటు ఫొటోలను షేర్ చేస్తోంది. గ్లామర్ ప్రదర్శనతో నెట్టింట హీటు పెంచేస్తోంది. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

కన్నడ అందం రాయ్ లక్ష్మి (Raai Laxmi) తమిళ్, మలయాళం చిత్రాల్లో ఎక్కువ సందడి చేస్తుంటుంది. తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్స్ తో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. గుర్తుండిపోయే సాంగ్స్ లో స్టార్స్ సరసన నటిస్తూ వస్తోంది. 
 

‘బలుపు’ చిత్రంతో తొలిసారిగా ‘లక్కీ లక్కీ రాయ్’ అనే స్పెషల్ సాంగ్ తో ఉర్రూతలూగించింది. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘ఖిలాడీ నెంబర్ 150’, ‘ది లెజెండ్’ వంటి చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్ లో నటించి ఆకట్టుకుంది. వెండితెరపై గ్లామర్ స్టెప్పులతో అదరగొట్టింది.


అంతకు ముందే రాయ్ లక్ష్మి  తెలుగులో రెండు సినిమాలు కూడా చేసింది. కెరీర్ ప్రారంభంలోనే ‘కాంచనమాల కేబుల్  టీవీ’, ‘నీకు నాకు’ వంటి చిత్రాల్లో నటించింది. హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇతర భాషల్లో నటిస్తూ వస్తోంది.
 

ప్రస్తుతం ఐటెం నెంబర్స్ తో వెండితెరపై రచ్చ చేస్తోంది. దక్షిణం, ఉత్తరాది ఆడియెన్స్ ను ఊర్రూతలూగిస్తోంది. రీసెంట్ గా ‘భోళా’ చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇలా వరుసగా వెండితెరపై మెరుస్తూనే వస్తోంది. నటిగానూ అవకాశాలు అందుకుంటోంది.
 

మరోవైపు రాయ్ లక్ష్మి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటోంది. అలాగే నెటిజన్లనూ తన నయా లుక్స్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 

ఆ మధ్యలో గ్రీస్ లోని ఐలాండ్ లో వెకేషన్ ను ఎంజాయ్ చేసింది. బీచ్ లో బికినీలో దర్శనమిచ్చి రచ్చ చేసింది. అప్పటి ఫొటోల్లో మరిన్ని పంచుకుంది. అందాల ప్రదర్శనతో మతులు చెడగొట్టింది. ఒంపుసొంపులతో మైమరిపించింది. 

Latest Videos

click me!