చిరు వర్సెస్ గరికపాటి... పుల్లలు పెట్టింది నాగబాబే! అసలు వివాదం అక్కడే మొదలు!

Published : Oct 08, 2022, 04:19 PM IST

ప్రతిదాంట్లో నేనున్నానంటూ దూరిపోతాడు నాగబాబు. వివాదాలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చిరంజీవిని ఉద్దేశిస్తూ గరికపాటి చేసిన వ్యాఖ్యలను వివాదం చేసింది నాగబాబే అన్న వాదన తెరపైకి వచ్చింది.   

PREV
16
చిరు వర్సెస్ గరికపాటి... పుల్లలు పెట్టింది నాగబాబే! అసలు వివాదం అక్కడే మొదలు!
Chiranjeevi vs Garikapati

అలై బలై వేదికపై చిన్న సంఘటన చోటు చేసుకుంది. గరికపాటి నరసింహారావు ప్రసంగిస్తూ ఉండగా... చిరంజీవి వేదికపై ఒక మూలన అభిమానులతో ఫోటోలు దిగుతున్నారు. ఆ సంఘటన గరికపాటిని అసహనానికి గురి చేసింది. చిరంజీవి గారు మీరు ఫోటో షూట్ ఆపితే నేను ప్రసంగం మొదలుపెడతా, లేదంటారా నేను వెళ్ళిపోతా అభ్యంతరం ఏమీలేదన్నారు. 

26
Chiranjeevi vs Garikapati

పరిస్థితిని అర్థం చేసుకొని చిరంజీవి ఫోటోలు దిగడం ముగించారు. వేదికపైకి వచ్చి నరసింహారావుతో పాటు కూర్చున్నారు. అనంతరం చిరంజీవి తన ప్రసంగంలో గరికపాటిపై ప్రశంసలు కురిపించారు. ఇంటికి పిలిచి ఒకసారి మిమ్మల్ని సత్కరిస్తానని వేదికగా సాక్షిగా తెలియజేశారు. నిజానికి వివాదం అంతటితో ముగిసింది. ఎందుకంటే గరికపాటితో చిరంజీవి మాట్లాడారు. అలాగే మైక్ లో ఆయన గురించి గొప్పగా చెప్పారు. 
 

36
Chiranjeevi vs Garikapati


అన్నయ్యకు అవమానం జరిగిపోయింది, మెగా ఫ్యాన్స్ నిద్రలేవండని రెచ్చగొట్టింది మాత్రం నాగబాబు. ఆ సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో నాగబాబు సోషల్ మీడియాలో వాలిపోయాడు. ''ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే'' అని కామెంట్ పోస్ట్ చేశారు. నాగబాబు ట్వీట్ చేసిన తర్వాత మెగా ఫాన్స్, అభిమాన సంఘాలకు విషయం అర్థమైంది. అప్పుడు గరికపాటికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో స్పందించడం స్టార్ట్ చేశారు. 

46
Chiranjeevi vs Garikapati


వివాదం పెద్దదై మెగా ఫ్యాన్స్ వర్సెస్ బ్రాహ్మణ సంఘాలు అన్నట్లు మారిపోయింది. గరికపాటికి మద్దతుగా బ్రాహ్మణ సంఘాలు నిలబడగా... గరికపాటి చిరంజీవికి క్షమాపణలు చెప్పాలి మెగా అభిమానులు డిమాండ్ చేశారు. బ్రాహ్మణ సంఘాలతో గొడవలు, వివాదాలు మెగాస్టార్ కి నచ్చలేనట్లుంది. స్పష్టమైన కారణం ఏమిటో కానీ నిన్న సాయంత్రానికి నాగబాబు మెత్తబడ్డారు. 
 

56
Chiranjeevi vs Garikapati

మెగా ఫ్యాన్స్ ఎవరూ గరికపాటి గారిని ట్రోల్ చేయవచ్చు. దూషించవద్దన్నారు. గరికపాటి వంటి పండితులు వేదికపై అలా మాట్లాడి ఉండకూడదు అనే ఉద్దేశంతో ట్వీట్ చేశాను. ఆయన క్షమాపణలు చెప్పాలని కోరుకోలేదంటూ మరొక సోషల్ మీడియా పోస్ట్ చేశారు. అంటే గరికపాటితో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. 
 

66
Chiranjeevi vs Garikapati


అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్లు... తొందరపడి రెచ్చగొట్టే ట్వీట్స్ వేయడం ఎందుకు తర్వాత, అభిమానులు ఏమీ అనొద్దు అంటూ సంధి మార్గాలు అనుసరించడం ఎందుకు. అలై బలై వేడుకలో వేల మంది ఉన్నారు. అందరి ముందు సంఘటన జరిగింది. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో వారందరికీ తెలుసు. పూర్వాపరాలు ఆలోచించకుండా సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టి వివాదం పెద్దది చేసింది నాగబాబే. రాజకీయ నాయకుడిగా మారిన నాగబాబు తెల్లబట్టలు వేస్తున్నాడు. ఆ బట్టలు వెనకున్న శాంతి  భావాన్ని ఫాలో కావడం లేదు. 

click me!

Recommended Stories