సెకనుకు 10 లక్షలు.. 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : Oct 13, 2026, 09:49 AM IST

బాలీవుడ్ హీరోయిన్లతో పోటీ పడి మరీ రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారు సౌత్ హీరోయిన్లు. 40 ఏళ్లు దాటినా సరే తగ్గేదే లేదంటున్నారు. ఓ సౌత్ హీరోయిన్ అయితే ఏకంగా సెకనుకు రూ. 10 లక్షలు వసూలు చేసిందట. నిజమెంత? ఎవరా హీరోయిన్?

PREV
15
సౌత్ లో తిరుగులేని ఇమేజ్ ఉన్న స్టార్ హీరోయిన్..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఇచ్చే భారీ పారితోషికాల గురించి తరచూ వింటూనే ఉంటాం. అయితే, వారికి ఏమాత్రం తగ్గకుండా కమర్షియల్ యాడ్స్‌లో నటించి రికార్డు స్థాయి రెమ్యునరేషన్ అందుకుంటోంది సౌత్ 'లేడీ సూపర్ స్టార్' నయనతార. కేవలం 50 సెకన్ల బ్రాండ్ అడ్వర్టైజ్‌మెంట్ కోసం నయనతార అక్షరాలా రూ. 5 కోట్లు చార్జ్ చేసి సంచలనం సృష్టించిందట. అంటే లెక్కగడితే ప్రకటనలో ప్రతి సెకనుకూ ఆమె అందుకున్న రెమ్యునరేషన్ రూ. 10 లక్షలు!

25
20 ఏళ్ల సినీ ప్రయాణం - చెక్కుచెదరని ఇమేజ్

కేరళకు చెందిన నయనతార మలయాళ చిత్రం 'మనస్సిన్‌క్కరే'తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'అయ్యా' సినిమాతో అరంగేట్రం చేసి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా స్పీడ్‌గా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సుమారు రెండు దశాబ్దాలుగా (20 ఏళ్లు) తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో స్టార్‌డమ్‌ను కాపాడుకుంటూ వస్తోంది. 40 ఏళ్లు దాటినా, వివాహమై ఇద్దరు పిల్లలు (సరోగసీ ద్వారా పొందిన కవలలు) ఉన్నప్పటికీ, ఆమె మార్కెట్ వాల్యూ గానీ, క్రేజ్ గానీ రవ్వంతైనా తగ్గలేదు.

35
అత్యధిక పారితోషికం అందుకునే నటిగా రికార్డు

దక్షిణ భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయనతార అగ్రస్థానంలో నిలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఆమె రూ. 12 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్ సరసన నటించిన 'జవాన్' చిత్రం రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ఆమె పాన్ ఇండియా స్థాయి ఇమేజ్‌ను కూడా సాధించింది.

45
ప్రకటనల ప్రపంచంలో కొత్త బెంచ్‌మార్క్

సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ల ద్వారా కూడా నయన్ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. పోయిన ఏడాది ప్రముఖ డీటీహెచ్ బ్రాండ్ టాటా స్కై (Tata Play) కమర్షియల్ యాడ్ కోసం ఆమె రూ. 5 కోట్లు పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. రెమ్యునరేషన్‌పై అధికారిక సమాచారం లేకపోయినా.. ఇండస్ట్రీలో మాత్రం టాక్ గట్టిగా వినిపించింది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ తదితర నాలుగు భాషల్లో రెండు రోజుల పాటు సాగిన షూటింగ్‌లో పాల్గొని ఈ భారీ మొత్తాన్ని ఆమె అందుకున్నారట.

55
బిజినెస్ ఉమెన్‌గానూ సత్తా..

నటిగానే కాకుండా వ్యాపారవేత్తగా, నిర్మాతగానూ నయనతార సత్తా చాటుతోంది. తన భర్త విగ్నేష్ శివన్‌తో కలిసి 'రౌడీ పిక్చర్స్' అనే ప్రొడక్షన్ హౌస్ ద్వారా విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్నారు. సొంతంగా కొన్ని బిజినెస్‌లను కూడా నడిపిస్తున్న నయనతార.. దుబాయ్‌లో తన ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు కూడా పెట్టినట్టు సమాచారం. సినిమాలు, కమర్షియల్ యాడ్స్‌తో కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నయనతార, భారతీయ సినీ రంగంలో తనదైన శైలిలో రికార్డులు తిరగరాస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories