వావ్..అర్థరాత్రి నడిరోడ్డుపై నయనతార..నీలిరంగు డ్రెస్ లో మెరుపులు, క్యాజువల్ గా కనిపించినా ఆ కిక్కే వేరు

Published : Jul 17, 2023, 09:02 AM ISTUpdated : Jul 17, 2023, 09:09 AM IST

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత  ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. 

PREV
110
వావ్..అర్థరాత్రి నడిరోడ్డుపై నయనతార..నీలిరంగు డ్రెస్ లో మెరుపులు, క్యాజువల్ గా కనిపించినా ఆ కిక్కే వేరు

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత  ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. 

210

నయనతార ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నయన్ నటిస్తోంది.చాలా కాలం పాటు సహజీవనం చేసిన నయన్, విగ్నేష్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. 

310

నయనతార, విగ్నేష్ శివన్ జోడి ఎక్కడ కనిపించినా అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున జనసంద్రంలా మారడం చూస్తూనే ఉన్నాం. నయనతార సోషల్ మీడియాకి, మీడియాకి దూరంగా ఉంటుంది. ఇక విగ్నేష్ శివన్ మాత్రమే సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ విశేషాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 

410

చూస్తూ ఉండగానే నయనతార, విగ్నేష్ వివాహం జరిగి ఏడాది గడచిపోయింది. ఇటీవలే నయన్ విగ్నేష్ ఫస్ట్ మ్యారేజ్ యానవర్సరీ కూడా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా విగ్నేష్ శివన్ సోషల్ మీడియాలో నయనతార తమ కవల పిల్లలని ఎత్తుకుని ఉన్న ఫొటోస్ ని షేర్ చేశాడు. 

510

నయనతార, విగ్నేష్ జంట సరోగసి విధానం ద్వారా పిల్లల్ని పొందారు. వీరికి కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. నయనతార సరోగసి విధానంపై కూడా పెద్ద వివాదమే జరిగింది. 

610

కానీ ఇప్పుడు నయన్, విగ్నేష్ పూర్తిగా తమ పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు. పెళ్ళైన కొన్ని నెలలకే నయన్, విగ్నేష్ సరోగసి ద్వారా పిల్లలని పొందారు. నయనతార ఫొటోస్ షేర్ చేస్తూ విగ్నేష్ శివన్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

710

నా జీవితానికి మూలం నువ్వే. ఈ ఏడాది ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ తో గడిచింది. అనేక ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. ఊహించని విధంగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఎన్నో కఠిన పరీక్షలు ఎదురయ్యాయి. 

810

ఎన్ని కష్టాలు ఎదురైనా ఇంటికి తిరిగొచ్చి నా అందమైన ఫ్యామిలీని చూస్తే కోల్పోయిన ఎనెర్జీ మొత్తం తిరిగి వస్తుంది. కలలు సాకారం చేసుకునే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఫ్యామిలీ ద్వారా వచ్చే కాన్ఫిడెన్స్ వేరే స్థాయిలో ఉంటుంది అంటూ విగ్నేష్ శివన్ ఎమోషనల్ కామెంట్స్ పెట్టారు. 

910

ఇదిలా ఉండగా నయనతార తాజాగా ముంబయి విమానాశ్రయంలో మెరిసింది. అర్థరాత్రి మెరుపులు మెరిపిస్తూ దర్శనం ఇచ్చింది. నయనతార క్యాజువల్ లుక్స్ సైతం ఇంటర్నెట్ షేక్ అయ్యేలా చేస్తున్నాయి. 

1010

నీలిరంగు డ్రెస్ లో చక్కటి చిరునవ్వుతో, అమాయకమైన చూపులతో నయన్ రోడ్డుపై వెళుతున్న ఫొటోస్ వైరల్ గా మారాయి. నయన్ ప్రస్తుత్తం షారుఖ్ సరసన జవాన్ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. 

click me!

Recommended Stories