నయనతార ఆస్తులు లీక్‌.. జెట్‌ విమానం, లగ్జరీ ఫ్లాట్లు, షాకిచ్చే పారితోషికం.. విలువెంతో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌

Published : Sep 18, 2022, 11:47 AM ISTUpdated : Sep 18, 2022, 12:54 PM IST

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార హీరోలకు దీటుగా రాణిస్తుంది. భారీ పారితోషికం అందుకుంటుంది. తాజాగా ఆమె ఆస్తుల వివరాలు బయటకొచ్చాయి. ఆస్తుల విలువ తెలిస్తే మాత్రం మైండ్‌ బ్లాక్‌ అయిపోతుంది. 

PREV
17
నయనతార ఆస్తులు లీక్‌.. జెట్‌ విమానం, లగ్జరీ ఫ్లాట్లు, షాకిచ్చే పారితోషికం.. విలువెంతో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌

నయనతార(Nayanthara) ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని స్టార్‌ హీరోయిన్‌గా నిలబడింది. రెండు మూడుసార్లు ప్రేమ విఫలం, అనేక పరాజయాలు ఆమెని మరింత బలంగా మార్చాయి. స్ట్రాంగ్‌ ఉమెన్‌గా, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌కి సరైన అర్థంగా నిలిచింది నయనతార. ఆమె ఇప్పుడు తిరుగులేని స్టార్‌ హీరోయిన్ గా రాణిస్తుంది. విజయశాంతి తర్వాత లేడీ సూపర్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ని దక్కించుకుని తన సత్తాని చాటుతుంది. 
 

27

ఇటీవల మ్యారేజ్‌ చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది నయనతార. ప్రేమించి దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌(Vignesh Shivan)ని పెళ్లి చేసుకుంది. చాలా గ్రాండ్‌గా వీరి వివాహం జరగడం విశేషం. అనంతరం వెంటనే షూటింగ్‌లో పాల్గొంది నయనతార. షూటింగ్‌ గ్యాప్‌లో హనీమూన్‌ కూడా చేసుకుంది. మళ్లీ ఇప్పుడు కమిట్‌ అయిన సినిమాలతో బిజీగా ఉంది. అయితే కమిట్‌ అయిన సినిమాలు పూర్తి చేసి ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. వ్యాపారాలు, ప్రొడక్షన్‌ చూసుకోవడం, ఫ్యామిలీకి టైమ్‌ కేటాయించాలనుకుంటున్నట్టు సమాచారం. 

37
nayanthara fitness

ఇదిలా ఉంటే తాజాగా నయనతారకి ఓ మైండ్‌ బ్లాక్‌ ఇచ్చే వార్త ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆమె ఆస్తుల విలువ(Nayanthara Assets) సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. కోట్ల ఆస్తులకు ఆమె అధిపతి అంటూ ఓ వార్త హల్‌చల్‌ చేస్తుంది. నయనతార తన సొంతంగా సంపాదించిన ఆస్తులే ఏకంగా రూ.165కోట్లు ఉంటాయని సమాచారం. ఆదాయపన్ను శాఖకి నయనతార సమర్పించిన పత్రాల్లో ఈ మొత్తం ఆస్తుల వివరాలు తెలిపినట్టు సమాచారం. 

47

నయనతారం ఇప్పుడు ఒక్కో సినిమాకి పది కోట్ల వరకు డిమాండ్‌ చేస్తుందట. బాలీవుడ్‌లో ఆమె షారూఖ్‌ ఖాన్‌తో `జవాన్‌` చిత్రంలో నటిస్తుంది. అట్లీ దర్శకత్వం వహించే ఈ సినిమాకి నయన్ కి ఏకంగా పది కోట్ల వరకు రెమ్యూనరేషన్‌(Remuneration) ఇస్తున్నట్టు సమాచారం. ఇతర సినిమాలకు కూడా దాదాపు ఆ మొత్తాన్ని డిమాండ్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు యాడ్స్ తోనూ బిజీగా ఉంది నయనతార. ఆమె ఒక్కో యాడ్ కి ఐదు కోట్ల తీసుకుంటుందని టాక్‌.

57

మరోవైపు ఇటీవల నయనతార జెట్‌ విమానాన్ని(Jet Flight) కొనుగోలు చేసిందట. దీని వాల్యూ 20కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. తరచూ ఆమె దీన్ని వాడుతున్నట్టు టాక్‌. మరోవైపు నయనతారకి ఇండియాలోని పలు నగరాల్లో లగ్జరీ అపార్ట్ మెంట్లు, ఫ్లాట్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లోనే రెండు లగ్జరీ బంగ్లాలున్నాయట. బంజరాహిల్స్ లో ఖరీదైన ప్లాట్లు తీసుకుందని, ఒక్కో ప్లాట్‌ ధర పదిహేను కోట్లు ఉంటుందని సమాచారం. 

67

దీంతోపాటు చెన్నైలో అత్యాధునిక సదుపాయాలతో, లావిష్‌గా ఉండే నాలుగు ప్లాట్లు ఉన్నాయట. కేరళాలో పేరెంట్స్ నివసిస్తున్న ఇల్లు కూడా చాలా ఖరీదైనదే అని టాక్‌. దీంతోపాటు దేశంలోని పలు నగరాల్లో ఆమె ప్లాట్లు కొనిపెట్టిందని సమాచారం. మరోవైపు నయనతారకి ఒక లిప్‌బామ్‌ కంపెనీ కూడా ఉంది. తన స్నేహితురాలు వనిత రాజన్‌తో కలిసి ఈ కంపెనీని ప్రారంభించింది. మరోవైపు నిర్మాతగానూ రాణిస్తుంది నయనతారం. ఇలా మున్ముందు మరిన్ని వ్యాపారాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తుందట లేడీ సూపర్‌ స్టార్‌. 
 

77

ఇక సినిమాల పరంగా ప్రస్తుతం నయనతార తెలుగులో `గాడ్‌ ఫాదర్‌`లో చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది. `సైరా`లో ఆమె చిరుకి జోడీగా నటించిన విషయం తెలిసిందే. మరోవైపు హిందీలో `జవాన్‌`తోపాటు తమిళంలో కనెక్ట్`, `ఇరైవన్‌`, మలయాళంలో `గోల్డ్` చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories