#Meena: ఫ్రెండ్స్ తో కలిసి మీనా బర్త్ డే సెలబ్రేషన్‌.. రాధికాతో స్పెషల్‌ లంచ్‌.. ఫోటోలు వైరల్‌

Published : Sep 18, 2022, 10:20 AM ISTUpdated : Sep 18, 2022, 11:58 AM IST

నిన్నటితరం స్టార్‌ హీరోయిన్‌ మీనా తన పుట్టిన రోజుని జరుపుకుంది. తన స్నేహితుల మధ్య ఆమె ఈ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా వైరల్‌ అవుతున్నాయి.   

PREV
110
#Meena:  ఫ్రెండ్స్ తో కలిసి మీనా బర్త్ డే సెలబ్రేషన్‌.. రాధికాతో స్పెషల్‌ లంచ్‌.. ఫోటోలు వైరల్‌

క్యూట్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌ని ఓ ఊపుఊపింది మీనా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతోపాటు హిందీలోనూ పలు సినిమాలు చేసి రాణించింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు సౌత్‌ సినిమాని ఏలిన మీనా రెండు రోజుల క్రితం(సెప్టెంబర్‌ 16న) తన 46వ పుట్టిన రోజుని జరుపుకుంది. 
 

210

ఇటీవల తన భర్త విద్యాసాగర్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇంకా ఆ బాధ నుంచి తేరుకోలేరు మీనా. ఆమెని ఆ బాధ నుంచి బయటకు తెచ్చేందుకు సినిమా స్నేహితులు రంభ, స్నేహా, సంఘవి, సంగీత ప్రయత్నిస్తున్నారు. ఆమెని తరచూ కలుస్తున్న విషయం తెలిసిందే. బర్త్ డే సందర్భంగానూ వారంతా కలిసి మీనా బర్త్ డేని సెలబ్రేట్‌ చేశారు. 
 

310

మీనా స్నేహితులంతా ఆమె ఇంటికి వెళ్లి కేక్‌ కట్‌ చేయించారు. చాలా సేపు ఆమెతో సరదాగా గడిపారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మళ్లీ పాతరోజుల్లోకి వెళ్లారు. ఆ మధుర జ్ఞాపకాలతో మీనా బాధని తొలగించే ప్రయత్నం చేశారు. ఆమెని మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చి ఆమెని సంతోషంగా ఉండేలా చేశారు. వీరిలో శ్రీదేవి విజయ్‌ కుమార్‌ ప్రధానంగా ఉన్నారు.

410

బర్త్ డే సందర్భంగా మీనా చాలా సింపుల్‌గానే ఉన్నారు. భర్త ఇటీవలే చనిపోవడంతో ఆమె సెలబ్రేషన్‌ మూడ్‌లో లేదనే విషయం ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ బర్త్ డే ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది మీనా. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

510

ఇందులో ఆమె చెబుతూ, `ఎల్లప్పుడూ మీ కోసం ఉత్తమంగా ఆలోచించే, నన్ను సంతోషంగా చూడటానికి వారి వంతు కృషి చేసే అందమైన స్నేహితులు నాకు ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. వారికి నా కృతజ్ఞతలు` అంటూ ఎమోషనల్‌ కామెంట్స్ చేసింది మీనా. 
 

610

మరోవైపు రాధిక శరత్‌ కుమార్‌ సైతం మీనాతో కలిసి ప్రత్యేకంగా గడిపింది. ఇద్దరు కలిసి డిన్నర్‌కి వెళ్లారు. ఈ పిక్ ని కూడా మీనా పంచుకుంటూ, నాతో లవ్లీ టైమ్‌ కేటాయించిన రాధికా శరత్‌ కుమార్‌కి థ్యాంక్స్ చెప్పింది. డిన్నర్‌ టైమ్‌లో వీరిద్దరు ఛిల్‌ అవుతున్నారు.
 

710

కెరీర్‌ పరంగా చూస్తే బాలనటిగానే కెరీర్‌ని ప్రారంభించింది మీనా. ఇరవైకి పైగా చిత్రాల్లో బాలనటిగా మెప్పించింది. స్టార్‌ హీరోల సినిమాల్లో బాల నటిగా నటించి ఆ తర్వాత హీరోయిన్‌గానూ నటించడం విశేషం. `నవయుగం` అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అనేక సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. 
 

810

సినిమాలతోపాటు టీవీ సీరియల్స్, టీవీ షోస్‌లోనూ మెరిసింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుని నటిగా తనని తాను నిరూపించుకుంది. క్యూట్‌ అందాలతో హోమ్లీ బ్యూటీ కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే అడపాదడపా పలు గ్లామర్‌ రోల్స్ కూడా చేసింది మీనా. తన ఘాటైన అందాలను పరిచయం చేసి ఆడియెన్స్ కి షాకిచ్చింది. తనలో ఈ యాంగిల్‌ కూడా ఉందని నిరూపించుకుంది. 
 

910

పెళ్లి తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్ ని ప్రారంభించి బలమైన కీలక పాత్రల్లో నటిస్తుంది. ఇటీవల ఆమె `దృశ్యం`సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. `సన్నాఫ్‌ ఇండియా`లోనూ మెరిసింది. పాత్రకి ప్రయారిటీ ఉంటేనే సినిమాలు చేస్తుంది. 

1010

2009లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌ని పెళ్లి చేసుకుంది మీనా. వీరికి కూతురు నైనికా ఉన్నారు. ఆమె `థెరి` చిత్రంలో బాలనటిగానూ నటించింది. భర్త విద్యాసాగర్‌ జూన్‌ 28న ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో కన్నుమూసిన విషయం తెలిసిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories