లక్ అంటే ఇలియానాదే.. అప్పుడు మహేష్‌.. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌.. మళ్లీ ఊపందుకుంటుందా?

Published : Aug 29, 2022, 08:29 PM ISTUpdated : Aug 29, 2022, 09:19 PM IST

గోవా బ్యూటీ ఇలియానా తెలుగు తెరపై కనిపించి చాలా రోజులవుతుంది. ఈ అమ్మడికి టాలీవుడ్‌లో అవకాశాలు దక్కడం లేదు. కానీ ఇటీవల ఓ సారి థియేటర్లో మెరిసిన ఈ భామ ఇప్పుడు మరోసారి తెలుగు ఆడియెన్స్ ని సర్‌ప్రైజ్‌ చేయబోతుంది.   

PREV
17
లక్ అంటే ఇలియానాదే.. అప్పుడు మహేష్‌.. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌.. మళ్లీ ఊపందుకుంటుందా?

సన్నజాజి అందాలతో టాలీవుడ్‌ని ఓ ఊపుఊపేసింది ఇలియానా(Ileana). సన్నని నడుమందాలతో తెలుగు ఆడియెన్స్ కి మైండ్‌ బ్లాక్‌ చేసింది. అందం అంటే ఇలా ఉండాలనేలా అందానికి కొత్త నిర్వచనం తీసుకొచ్చింది. `పోకిరి` సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. వెనక్కి తిరిగి చూసుకో అవసరం లేకుండా దూసుకుపోయింది. వరుసగా స్టార్స్ అందరితోనూ చేసింది. 
 

27

అయితే చాలా కాలంగా ఇలియానాకి సరైన అవకాశాలు లేవు. ఆమెని టాలీవుడ్‌ మర్చిపోయిందనే చెప్పాలి. అలాంటి టైమ్‌లో పెద్ద లిఫ్ట్ ఇచ్చాడు మహేష్‌. ఇటీవల తన బర్త్ డే సందర్భంగా మహేష్‌ నటించిన `పోకిరి` (Pokiri) సినిమా విడుదలైంది. ఇందులో ఇలియానా హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే. `పోకిరి` స్పెషల్‌ షోలతో ఈ గోవా బ్యూటీని మరోసారి తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేశారు. మహేష్‌ బర్త్ డే (Maheshbabu)సందర్భంగా `పోకిరి` సినిమాని చాలా చోట్లు స్పెషల్‌గా ప్రదర్శించారు. ప్రదర్శించిన అన్ని చోట్ల హౌజ్‌ ఫుల్‌ అయ్యాయి. 

37

ఇప్పుడు అదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) ఫ్యాన్స్. సెప్టెంబర్‌ 2న పవర్‌ స్టార్‌ బర్త్ డే. దీంతో పవన్‌ నటించిన సినిమాని కూడా స్పెషల్‌గా ప్రదర్శించబోతున్నారు. అందులో భాగంగా `జల్సా` (Jalsa) సినిమాని సెప్టెంబర్ 1న స్పెషల్‌ గా ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్‌ కాగా, అన్ని చోట్ల ఫుల్‌ అయ్యాయి. 
 

47

అయితే `జల్సా`లోనూ హీరోయిన్‌ ఇలియానా కావడం విశేషం. దీంతో ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ సైతం ఇలియానాకి లిఫ్ట్ ఇవ్వబోతున్నారని చెప్పొచ్చు. మర్చిపోయిన ఇలియానాని తెలుగు ఆడియెన్స్ కి గుర్తు చేస్తున్నారు. భాగమతిగా ఆమె చేసిన అల్లరితో మరోసారి ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేయబోతున్నారు. మరి ఇలా చూసైనా ఈ గోవా బ్యూటీకి ఆఫర్లు వస్తాయేమో చూడాలి. 
 

57

ఇలియానా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బిజీగానే ఉంది. తన బీచ్‌ ఫోటోలను వరుసగా షేర్‌ చేసుకుంటుంది. బికినీ అందాలను చూపిస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అదే సమయంలో మేకర్స్ దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తుంది.ఎన్ని చేసినా ఆమెకి కొత్తగా ఆఫర్లు రాకపోవడం గమనార్హం. 

67

ఇక `దేవదాస్‌`, `పోకిరి` చిత్రాల బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ తో టాలీవుడ్‌లో ఓవర్‌నైట్‌లో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది ఇలియానా. తన నడుముతో టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. వరుస విజయాలు అందుకుని అత్యంత డిమాండెడ్‌హీరోయిన్‌గా నిలిచింది. ఆ టైమ్‌లో అత్యంత పారితోషికం అందుకునే హీరోయిన్‌గా, స్టార్‌ హీరోలకు బెస్ట్ జోడీగా నిలిచింది. తన నడుమందాలతో ఆద్యంతం ఆకట్టుకుంది.

77

అయితే లవ్‌లో పడటం, బాడీలో వచ్చిన మార్పులు, బరువు పెరగడం వంటి కారణాలతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లింది. దీంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దాన్నుంచి నెమ్మదిగా బయటపడింది. కానీ జరగాల్సిన నష్టం జరిగింది. ఈ బ్యూటీ ఇండస్ట్రీ మర్చిపోయిందనే చెప్పాలి. తనని తాను గుర్తు చేస్తూ సోషల్‌ మీడియా పోస్ట్ లతో తాను ఉన్నానననే విషయాన్ని గుర్తు చేస్తుంది ఇలియానా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories