Nayanthara Controversies: నయనతారతో కలిసి అల్లు అర్జున్ జీవితంలో నటించడా.. ఒకటా రెండా లెక్కలేనన్ని వివాదాలు

Published : Apr 18, 2026, 09:22 PM IST

లేడీ సూపర్ స్టార్ నయనతార, సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం, పెళ్లి, సరోగసీ ద్వారా పిల్లల్ని కనడం వంటి అనేక కాంట్రవర్సీలను ఈ ఫొటో గ్యాలరీలో చూద్దాం.

PREV
17
నయనతార - శింబు
నటి నయనతార, నటుడు శింబు 'వల్లవన్' సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. సినిమా ఫంక్షన్లకు కూడా జంటగా హాజరయ్యారు. అయితే, వీరిద్దరూ బెడ్‌రూమ్‌లో ముద్దు పెట్టుకుంటున్న ఒక ఫొటో లీక్ అవ్వడంతో పెద్ద దుమారం రేగింది. ఆ ఫొటో తర్వాత ఇద్దరూ విడిపోయారు.
27
నయనతార - ప్రభుదేవా
శింబుతో విడిపోయాక నయనతార ప్రభుదేవాతో ప్రేమలో పడింది. అప్పటికే ప్రభుదేవాకు పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారు. దీంతో నయన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒకానొక దశలో ప్రభుదేవా భార్య రమ్లత్ మాట్లాడుతూ.. 'నయనతార ఎక్కడైనా కనిపిస్తే తంతాను' అని వ్యాఖ్యానించడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.
37
నయనతార - ధనుష్
నయనతార, ధనుష్ మంచి స్నేహితులుగా ఉండేవారు. ఆ స్నేహంతోనే ధనుష్ నిర్మించిన 'ఎదిర్ నీచల్' సినిమాలో నయన్ రెమ్యునరేషన్ తీసుకోకుండా ఒక పాటలో డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత ధనుష్ నిర్మాణంలో 'నానుమ్ రౌడీ దాన్' సినిమా మొదలైంది. ఈ సినిమా షూటింగ్‌లో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో నయనతార తన సొంత డబ్బు ఖర్చుపెట్టి ఆ సినిమాను పూర్తి చేసింది.
47
నయనతార - అల్లు అర్జున్

'నానుమ్ రౌడీ దాన్' సినిమాకు గాను నయనతార ఓ అవార్డు అందుకుంది. ఆ అవార్డును ఇచ్చేందుకు అల్లు అర్జున్ స్టేజీపైకి వచ్చారు. అయితే, నయన్ అతని చేతుల మీదుగా అవార్డును తీసుకోడానికి నిరాకరించి, విఘ్నేశ్ శివన్ చేతుల మీదుగా తీసుకుంటానని చెప్పింది. దీంతో అల్లు అర్జున్ అవమానంగా భావించి, ఆమెతో ఎప్పుడూ నటించకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది.

57
నయనతార పెళ్లి
నయనతార 2022లో విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లైన వెంటనే ఇద్దరూ తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే, ఆలయ ప్రాంగణంలో ఫొటోషూట్ నిర్వహించడం, ఆ సమయంలో నయనతార చెప్పులు ధరించడం పెద్ద వివాదానికి దారితీసింది. ఆ తర్వాత విఘ్నేశ్ శివన్ క్షమాపణలు చెప్పాడు.
67
నయనతార ప్లాస్టిక్ సర్జరీ
నటి నయనతారకు 40 ఏళ్లు వచ్చినా యంగ్‌గా కనిపిస్తారు. తన అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. అందుకే ఆమె ముఖం మారిపోయిందని ప్రచారం జరిగింది. అయితే, దానికి నయన్ స్పందిస్తూ.. తన ముఖంలో మార్పుకు కారణం డైట్ మాత్రమేనని, ఎలాంటి సర్జరీ చేసుకోలేదని వివరణ ఇచ్చింది.
77
సరోగసీ
పెళ్లైన నాలుగు నెలలకే నయనతారకు కవల పిల్లలు పుట్టారు. సరోగసీ ద్వారా ఆమె పిల్లల్ని కన్నది. పెళ్లికి ముందే సరోగసీకి ఏర్పాట్లు చేసుకోవడం చట్టవిరుద్ధం కావడంతో, నయన్ నిబంధనలు ఉల్లంఘించిందని వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన నయన్, తాను 2019లోనే విఘ్నేశ్ శివన్‌ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Read more Photos on
click me!

Recommended Stories