తమిళ సినిమాల్లో వివాదాలకు కొదవలేని జంట విగ్నేష్ శివన్ - నయనతార. ఎందుకంటే వీరి ప్రేమ నుండి పెళ్లి వరకు అన్నీ వివాదాస్పదంగానే జరిగాయి. నానుమ్ రౌడీ ధాన్ సినిమాలో పనిచేస్తున్నప్పుడు విగ్నేష్ శివన్ - నయనతార మధ్య ప్రేమ చిగురించింది. ఆ సినిమాలో కలిసి పనిచేసిన వారికే తెలియకుండా ఇద్దరూ రహస్యంగా ప్రేమించుకున్నారు.
ఆ తర్వాత వీరి ప్రేమ వ్యవహారం బయటపడటంతో, ఇద్దరూ జంటగానే బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. అంతేకాకుండా ఇద్దరూ కలిసి విదేశాలకు విహారయాత్రలకు వెళ్లడం, అక్కడ తీసిన ఫోటోలను పోస్ట్ చేయడం వంటివి చేస్తూ ఇన్‌స్టాలో ట్రెండింగ్ జంటగా వెలుగొందారు.