Thammudu Review: `తమ్ముడు` ట్విట్టర్‌ రివ్యూ, నితిన్‌కి ఇప్పుడైనా హిట్ పడిందా?

Published : Jul 04, 2025, 07:07 AM IST

నితిన్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ రూపొందించిన `తమ్ముడు` మూవీ నేడు శుక్రవారం విడుదలయ్యింది. అయితే ఇప్పటికే ఓవర్సీస్‌లో మూవీని ప్రదర్శించారు. అక్కడి రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. 

PREV
15
`తమ్ముడు` మూవీ ట్విట్టర్‌ రివ్యూ

నితిన్‌ హీరోగా సప్తమి గౌడ హీరోయిన్‌గా, లయ, వర్ష బొల్లమ్మ, స్వసిక వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం `తమ్ముడు`. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, శిరీష్‌ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మించారు. 

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌, పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసింది. సినిమాలో విషయం ఉందని అర్థమయ్యింది.

25
హిట్‌ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌

నితిన్‌ ప్రతి సినిమాలోనూ పవన్‌ కళ్యాణ్‌ సెంటిమెంట్‌ని ఫాలో అవుతారు. ఆయన పవన్‌ కళ్యాణ్‌కి అభిమాని అనే విషయం తెలిసిందే. దాన్ని ఏదో రూపంలో తమ సినిమాల్లో ఇన్‌ బిల్డ్ చేస్తూనే ఉంటారు. ఇందులోనూ పవన్‌ అభిమానిగా కనిపిస్తారట. 

ఆయన ఫోటోని కూడా చూపించబోతున్నట్టు ఇప్పటికీ ఇంటర్వ్యూలలో తెలిపారు. అయితే ప్రతి సినిమాలోనూ ఇదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారు నితిన్‌. కానీ సక్సెస్‌ ఆయనకు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఒక్క హిట్‌ వస్తే, నాలుగైదు పరాజయాలు వెంటాడుతున్నాయి. 

ఈ క్రమంలో `తమ్ముడు` చిత్రంతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని కసితో ఉన్నారు. అయితే ఇప్పటికే ఓవర్సీస్‌లో మూవీని ప్రదర్శించారు. మరి నితిన్‌కి హిట్‌ పడిందా అక్కడి రిపోర్ట్ ఎలా ఉందనేది ట్విట్టర్‌ రివ్యూలో తెలుసుకుందాం.

35
`తమ్ముడు` ఓవర్సీస్‌ టాక్‌ ఇదే

సినిమా కథగా చూస్తే అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు చేసే పోరాటమే ఈ కథ అని అర్థమవుతుంది. సినిమా ప్రారంభం బయట జరుగుతుంది. కథలోకి తీసుకెళ్లేంత వరకు నార్మల్‌గా, ఆ తర్వాత అర్థరాత్రికి షిఫ్ట్ అవుతుందట. 

మొత్తం ఫారెస్ట్, అక్కడ ఉండే గ్రామాల చుట్టూ కథ అల్లుకుని ఉందట. ఆ గ్రామంపై పెద్ద వాళ్ల కన్నుపడటం, దాన్ని లాక్కునే ప్రయత్నం చేయడం, ఆ ప్రజలకు అండగా హీరో, మెయిన్‌ కాస్టింగ్‌ నిలబడటమే మూవీ స్టోరీ అని అర్థమవుతుంది. 

సినిమా విలన్‌ ఎంట్రీతో స్టార్ట్ అవుతుందట. విలన్‌ పాత్రధారికి భారీ ఎలివేషన్లు ఇచ్చారట. ప్రారంభ సన్నివేశాలు రెగ్యూలర్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కథ విభిన్నంగా అనిపిస్తుందట.

45
`తమ్ముడు`కి మిశ్రమ స్పందన

దర్శకుడు వేణు శ్రీరామ్‌ ఎంచుకున్న కథ కొత్తగా ఉందని, చాలా డిఫరెంట్‌గా ఉందని, కథని చెప్పే విధానంలో మంచి నావల్టీ ఉందని ఓవర్సీస్‌ ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. స్టోరీ పాయింట్‌ చిన్నగా ఉందని, ఒకే రాత్రిలో కథ సాగుతుందని అంటున్నారు. 

కాకపోతే సినిమాని నడిపించిన తీరు రెగ్యూలర్‌గానే అనిపిస్తుందట. హై మూమెంట్స్ ఆశించిన స్థాయిలో లేవని, కాస్త స్లోగా సాగుతుందని తెలుస్తోంది. ఫస్టాఫ్‌తో పోల్చితే సెకండాఫ్‌ బాగుందని, ఇంటర్వెల్‌ యాక్షన్‌ అదిరిపోయిందని, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లు ఉన్నట్టు చెబుతున్నారు.

55
`తమ్ముడు`లో హైలైట్స్ ఇవే

సినిమా కోసం నితిన్‌ చాలా కష్టపడ్డారని ట్రైలర్‌ చూసినప్పుడే అర్థమయ్యింది. సినిమాలో ఆ విషయం స్పష్టమవుతుంది. సినిమా కోసం ప్రాణం పెట్టాడని అంటున్నారు. నటుడిగా ఆయనలో మరో స్థాయిని చూస్తారట. 

ఇక ఒకప్పటి హీరోయిన్‌ లయ ఈమూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఆమెకిది మంచి కమ్‌ బ్యాక్ మూవీ అవుతుందని, ఆమె పాత్ర చాలా బలంగా ఉందని, అదే సమయంలో ఆమె కూడా అదే స్థాయిలో నటించిందని అంటున్నారు. లయ పాత్ర చాలా హుందాగా ఉంటుందట. 

హీరోయిన్ల సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక వంటి పాత్రలు కీలకంగా ఉంటాయని, చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయట.ఇందులో మెయిన్స్ రోల్స్ అన్నింటికి చాలా ప్రయారిటీ ఉంటుందని ఓవర్సీస్‌ రిపోర్ట్ చెబుతుంది. హీరోయిన్లు యాక్షన్‌ చేయడం హైలైట్‌గా నిలుస్తుందట. 

కథ, యాక్షన్‌ సీన్లు, సెంటిమెంట్‌ సినిమాకి ప్రధాన బలాలు అంటున్నారు. ఓవర్సీస్‌ ఆడియెన్స్ రిపోర్ట్ ప్రకారం మూవీ యావరేజ్‌ నుంచి అబౌ యావరేజ్‌గా ఉందని తెలుస్తోంది. మరి వాస్తవంగా మూవీ ఎలా ఉందనేది `ఏషియానెట్‌ రివ్యూ` కోసం వేచి ఉండండి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories