బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న అర్జున్ కళ్యాణ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రేజీ సెలేబ్రిటిగా మారారు. గతంలో అర్జున్ కళ్యాణ్ ఓ హీరోయిన్ తో డేటింగ్ చేసిన విషయాన్ని అంగీకరించారు. ఆమెతో బ్రేకప్ ఎందుకు జరిగిందో కూడా రివీల్ చేశారు.
బిగ్ బాస్ షోతో సెలెబ్రిటీలుగా మారిపోయిన కంటెస్టెంట్స్ చాలామందే ఉన్నారు. వారిలో అర్జున్ కళ్యాణ్ ఒకరు. హ్యాండ్సమ్ లుక్స్ తో ఆకట్టుకునే అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో పాల్గొన్నారు. ఆ సీజన్ లో అర్జున్ కళ్యాణ్ బాగా హైలైట్ అయ్యారు. మరో కంటెస్టెంట్ శ్రీ సత్యతో అర్జున్ కళ్యాణ్ రిలేషన్ గురించి చాలా రూమర్స్ వచ్చాయి.
25
శ్రీసత్యతో రిలేషన్
వాసంతి కృష్ణన్ తో కూడా అర్జున్ కళ్యాణ్ లవ్ ట్రాక్ నడిపినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే అర్జున్ కళ్యాణ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ ఎఫైర్స్, బ్రేకప్స్ గురించి ఓపెన్ అయ్యాడు. శ్రీసత్యతో కొంతకాలం రిలేషన్ లో ఉన్నానని అర్జున్ కళ్యాణ్ తెలిపారు. బిగ్ బాస్ షోలో ఆమెతో మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. బిగ్ బాస్ షో తర్వాత కూడా కొంత కాలం అది కంటిన్యూ అయింది అని అర్జున్ కళ్యాణ్ తెలిపారు.
35
హీరోయిన్ తో డేటింగ్
ఇక వాసంతి కృష్ణన్ తో లవ్ లేదని జస్ట్ ఫ్రెండ్ షిప్ మాత్రమే అని అర్జున్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఆమెతో చేసిన కొన్ని రీల్స్ బాగా వైరల్ అయ్యాయి. అందువల్ల మా మధ్య లవ్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయని అర్జున్ కళ్యాణ్ అన్నారు. అయితే అంతకు ముందు అర్జున్ కళ్యాణ్ ఓ హీరోయిన్ తో పెళ్లి వరకు వెళ్లారు. కొంత కాలం ఆ హీరోయిన్ తో డేటింగ్ చేసిన విషయాన్ని అర్జున్ కళ్యాణ్ అంగీకరించారు.
రంగస్థలం నటితో పెళ్లి వరకు వెళ్లిన అర్జున్ కళ్యాణ్
ఆమె ఎవరో కాదు రంగస్థలం చిత్రంలో కీలక పాత్రలో నటించిన పూజిత పొన్నాడ. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా కూడా నటించారు. రంగస్థలం చిత్రంలో కథని మలుపు తిప్పే పాత్రలో పూజిత నటించింది. అర్జున్ కళ్యాణ్, పూజిత పొన్నాడ కలసి చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. 'ఉప్మా తినేసింది' అనే షార్ట్ ఫిలిం బాగా వైరల్ అయింది. వీరిద్దరూ రొమాంటిక్ సీన్స్ లో కూడా నటించారు. ఆ టైంలో తాను, పూజిత రిలేషన్ లో ఉన్నామని అర్జున్ కళ్యాణ్ అంగీకరించారు.
55
మా ఇద్దరికీ వర్కౌట్ కాలేదు
చాలా కాలం మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాం. ఒక సమయంలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. కానీ ఆ తర్వాత మా రిలేషన్ వర్కౌట్ కాలేదు. మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో విడిపోయినట్లు అర్జున్ కళ్యాణ్ తెలిపారు. పూజిత పొన్నాడ కూడా ఓ ఇంటర్వ్యూలో అర్జున్ కళ్యాణ్ తో లవ్ ఎఫైర్ గురించి మాట్లాడింది. అర్జున్ తో డేటింగ్ చేసిన మాట వాస్తవమే అని తెలిపింది. కానీ ఆ తర్వాత విడిపోయినట్లు పేర్కొంది.