హాయ్ నాన్న చిత్రంలో కూడా నాని, మృణాల్ మధ్య కిస్సింగ్ సీన్ ఉంది. ఓ ఇంటర్వ్యూలో మీ ప్రతి చిత్రంలో కిస్సింగ్ సీన్ ఉంటోంది. మీరే కావాలని డైరెక్టర్ ని అడిగి ఇలాంటి సీన్స్ రాయించుకుంటున్నారా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి నాని అదిరిపోయే సమాధానం ఇచ్చారు. దసరా చిత్రంలో కిస్ సీన్ లేదు, అంటే సుందరానికీ లో లేదు. మరి ఎందుకు అలా అడుగుతున్నారో అర్థం కావడం లేదు అని నాని అన్నారు.