హీరోయిన్‌గా అనేక సూపర్ హిట్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా వెలిగింది ఖుష్బూ సుందర్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో స్టార్‌గా రాణించింది. 1985 నుంచి 2005 వరకు హీరోయిన్‌గా సౌత్‌ని ఓ ఊపు ఊపేసింది. తెలుగులో ఆమె `కళియుగ పాండవులు`, `కెప్టెన్ నాగార్జున`, `త్రిమూర్తులు`, `భరతంలో అర్జునుడు`, `కిరాయి దాదా`, `జీవన జ్యోతి`, `శాంతి క్రాంతి`, `పేకాట పాపారావు` వంటి చిత్రాలు చేసింది. కీలక పాత్రలో చిరంజీవితో `స్టాలిన్` చిత్రంలోనూ మెరిసింది.