ఎంత నేషనల్‌ క్రష్‌ అయినా ఆ విషయంలో పూజా హెగ్డేని రీచ్‌ కాలేకపోతున్న రష్మిక మందన్నా.. తేడా ఏంటంటే?

Published : Mar 20, 2022, 01:50 PM IST

రష్మిక మందన్నా నేషనల్‌ క్రష్‌గా ఊహించిన క్రేజ్‌ని గుర్తింపుని సొంతం చేసుకుంది. మరోవైపు పూజా హెగ్డే అత్యంత లక్కీ ఛార్మ్ గా నిలుస్తుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం ఇంకా పూజాని చేరుకోలేకపోతుంది రష్మిక. 

PREV
18
ఎంత నేషనల్‌ క్రష్‌ అయినా ఆ విషయంలో పూజా హెగ్డేని రీచ్‌ కాలేకపోతున్న రష్మిక మందన్నా.. తేడా ఏంటంటే?

రష్మిక మందన్నా(Rashmika Mandanna) నేషనల్‌ క్రష్‌గా రాణిస్తుంది. `గీత గోవిందం` చిత్రంతోనే ఊహించని ఫాలోయింగ్‌ ఏర్పడింది. మహేష్‌తో నటించిన `సరిలేరు నీకెవ్వరు` సినిమా తర్వాత నేషనల్‌ క్రష్‌గా మారిపోయింది. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఆమె మూడు సినిమాలు చేస్తుంది. మరోవైపు తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. 
 

28

ఇటీవల `పుష్ప` చిత్రంతో పాన్‌ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది రష్మిక. దీనికి కొనసాగింపుగా రెండో భాగంలో నటించబోతుంది. మరోవైపు రామ్‌తోనూ మరో సినిమా చేస్తుంది. హిందీలో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి `మిషన్‌ మజ్ను` సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇలా యంగ్‌ హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది రష్మిక మందన్నా. స్టార్‌ హీరోలతో అవకాశాలు దోబూచులాడుతున్నాయి. 
 

38

మరోవైపు పూజా హెగ్డే (Pooja Hegde) కెరీర్‌ ప్రారంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా ఆ తర్వాత పుంజుకుంది. తెలుగులో చేసిన `డీజే` సినిమా పూజా కెరీర్‌నే టర్న్ తిప్పింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. వరుసగా స్టార్‌ హీరోలతో సినిమా చేస్తూ దూసుకుపోతుంది. తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. అత్యంత బిజీయెస్ట్, అత్యంత కాస్ట్లీ హీరోయిన్‌గా ఎదిగింది.
 

48

ఇప్పటికే పూజా హెగ్డే అల్లు అర్జున్‌తో రెండు సినిమాలు చేసింది. మహేష్‌తో రెండో సినిమాకి రెడీ అవుతుంది. ప్రభాస్‌, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో ఓ సినిమా చేయగా, పవన్‌తో త్వరలో సినిమా చేయబోతుంది. మరోవైపు తమిళంలో విజయ్‌తో `బీస్ట్` సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇలా అన్నీ స్టార్‌ హీరో సినిమాలే. ఇకపై కూడా ఆమె బన్నీతో ఓ చిత్రం చేయబోతుంది. ఇలా టాప్‌ స్టార్లతో సినిమాలు చేస్తూ తగ్గేదెలే అని నిరూపించుకుంటుంది పూజా. 

58

అయితే టాలీవుడ్‌లో అటు రష్మిక మందన్నా, ఇటు పూజా హెగ్డే సక్సెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్నారు. కానీ పూజా హెగ్డేని రీచ్‌ కాలేకపోతుంది రష్మిక మందన్నా. ఇంకా ఆమె సెకండ్‌ గ్రేడ్‌ హీరోలతోనే చేస్తుంది. అల్లు అర్జున్, మహేష్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, మహేష్‌, విజయ్‌ అంటే టాప్‌ స్టార్లు. పూజా వీరందరితోనూ ఓ రౌండ్‌ నటించింది. మరో రౌండ్‌ చుట్టేయబోతుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ స్టార్లతోనే సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతని చాటుకుంటుంది. నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. 
 

68

అయితే  రష్మిక ఎంత నేషనల్‌ క్రష్‌ అయినా ఇంకా ఆ స్థాయికి చేరుకోలేకపోతుంది. ఆమె పెద్ద హీరోలతో సినిమాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. పెద్ద హీరోల్లో మహేష్‌, బన్నీతోనే నటించింది. మరోవైపు ఇటీవల శర్వానంద్‌తో, ఇప్పుడు రామ్‌తో సినిమాలు చేస్తుంది. హిందీలోనూ సెకండ్‌ గ్రేడ్‌ హీరో సిద్ధార్థ్‌తోనే చేస్తుంది. బిగ్‌ స్టార్స్ ఆమె జాబితాలో లేరు. దీంతో పూజా లెవల్‌కి రష్మిక ఇంకా రీచ్‌ కాలేకపోతుందని నెటిజన్లు కామెంట్  చేస్తున్నారు. 

78

అయితే హీరోయిన్ల పరంగా ఇద్దరూ లక్కీ ఛార్మ్ గా నిలుస్తున్నారు. ఇద్దరూ పారితోషికం విషయంలో భారీగానే అందుకుంటున్నారు. దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. కానీ ఇద్దరి మధ్య ఉన్న తేడా చూస్తే.. పూజా పాత్ర ప్రయారిటీని సెకండ్‌గా భావిస్తుంది. స్టార్‌ హీరోలు, ప్రాజెక్ట్ ల స్థాయిని కన్సిడర్‌ చేస్తుంది. గ్లామర్‌ విషయంలో తగ్గేదెలే అంటోంది. 
 

88

కానీ రష్మిక మందన్నా ఈ విషయంలో వెనకబడి పోతుంది. వెండితెరపై ఆ స్థాయి స్కిన్‌ షో చేయడంలో నేషనల్‌ క్రష్‌ వెనకబడి పోతుంది. పైగా పాత్రలకు ప్రయారిటీ ఉండేలా చూసుకుంటుంది. దీనివల్లే అవకాశాల విషయంలో పూజాని రష్మిక రీచ్‌ కాలేకపోతుందంటున్నారు విశ్లేషకులు. అయితే ఇటీవల సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ అందరికి షాకిస్తుంది రష్మిక. తాను కూడా కమర్షియల్‌ హీరోయిన్‌ గా పేరుతెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అందాల ఆరబోతకు తాను సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది. దీంతో రష్మిక రేంజ్‌ కూడా మున్ముందు మారబోతుందంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.  అయితే రష్మిక ఇప్పుడు రామ్‌చరణ్‌తో ఓ సినిమా, విజయ్‌తో మరో సినిమా చేయబోతుందని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories