Babu Gogineni: విక్రమాదిత్యతో జాతకం చెప్పించుకోవాల్సింది.. 'రాధే శ్యామ్' పై రెచ్చిపోయిన బాబు గోగినేని

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 20, 2022, 11:58 AM IST

జాతకం, విధి రాత నేపథ్యంలో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. రాధే శ్యామ్ మూవీపై బాబు గోగినేని తీవ్ర విమర్శలు చేశారు.   

PREV
16
Babu Gogineni: విక్రమాదిత్యతో జాతకం చెప్పించుకోవాల్సింది.. 'రాధే శ్యామ్' పై రెచ్చిపోయిన బాబు గోగినేని

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకులు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. 

26

రాధే శ్యామ్ చిత్రం మల్టిప్లెక్స్ ఆడియన్స్ ని మెప్పిస్తున్నప్పటికీ ఒక వర్గం ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు. అందుకు కారణం ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడమే. విధి రాత, జాతకం నేపథ్యంలో తెరకెక్కిన ఎమోషనల్ ప్రేమ కథ ఈ చిత్రం. ప్రభాస్ ఈ చిత్రంలో హస్తసాముద్రిక నిపుణుడిగా నటించారు. చేతి గీతల్ని బట్టి ఎవరి భవిష్యత్తు అయినా చెప్పే సత్తా ఉన్న వ్యక్తి. 

36

అతడి ప్రేమ విషయంలో జాతకం ఎలా ఉంది.. ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది ఈ చిత్ర కథ. సాధారణంగా జోతిష్యం లాంటి విషయాలని సామజిక కార్యకర్త బాబు గోగినేని మూఢనమ్మకం అని కొట్టి పారేస్తారు. రాధే శ్యామ్ జ్యోతిష్యం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. దీనితో బాబు గోగినేని రాధే శ్యామ్ మూవీపై కూడా తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు, సెటైర్లు వేశారు. 

46
Radhe Shyam

రాధే శ్యామ్ మూవీపై బాబు గోగినేని సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాధే శ్యామ్ సినిమాలో చాలా అబద్దాలు ఉన్నాయని బాబు గోగినేని అన్నారు. ఒక సన్నివేశంలో కృష్ణం రాజు కెప్లర్ గురించి చెబుతారు. అది అబద్దం అని బాబు గోగినేని అంటున్నారు. 

56

'మీరు మీ అబద్దాలు.. కెప్లర్ నిజంగా చెప్పింది ఏంటంటే .. జ్యోతిష్య శాస్త్రం అనేది ఖగోళ శాస్త్రం నుంచి పుట్టిన చిన్న ఫూలిష్ బేబీ' అని కెప్లెర్ చెప్పినట్లు బాబు గోగినేని పేర్కొన్నారు. రాధే శ్యామ్ చిత్రంలో తన పరిశోధనలకు ఆధారం జ్యోతిష్య శాస్త్రం అని కెప్లెర్ చెప్పినట్లు కృష్ణం రాజు చెబుతారు. 

66

బుద్ది ఉన్నోడు ఎవడైనా వాట్సాప్ మెసేజ్ లు చూసి సినిమా డైలాగులు రాస్తాడా ? సినిమా తుస్ అంటగా.. సినిమా తీసే ముందే విక్రమాదిత్యతో జాతకం చూపించుకోవాల్సింది అంటూ బాబు గోగినేని సెటైర్లతో రెచ్చిపోయాడు. 

Read more Photos on
click me!

Recommended Stories