NNNM Final Collections: ఓటీటీలో బ్లాక్‌ బస్టర్‌ మూవీ.. నారీ నారీ నడుమ మురారి ఫైనల్‌ కలెక్షన్లు

Published : Feb 04, 2026, 09:03 PM IST

శర్వానంద్‌ హీరో నటించిన `నారీ నారీ నడుమ మురారి` మూవీ సంక్రాంతికి విడుదలై మంచి ఆదరణ పొందింది. సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. 

PREV
14
నారీ నారీ నడుమ మురారితో హిట్‌ అందుకున్న శర్వానంద్‌

శర్వానంద్‌ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ `నారీ నారీ నడుమ మురారి`. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. వీకే నరేష్‌, సిరి హనుమంతు, వెన్నెల కిశోర్‌, సంపత్‌ రాజ్‌, సుదర్శన్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. అనిల్‌ సుంకర నిర్మించిన ఈ మూవీ సంక్రాంతికి విడుదలై హిట్‌గా నిలిచింది. సంక్రాంతికి చివర్లో రిలీజ్‌ అయి లేట్‌గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చి హిట్‌ అందుకుంది. చాలా ఏళ్ల తర్వాత శర్వానంద్‌కి హిట్‌ ఇచ్చింది.

24
ఓటీటీలోకి వచ్చిన నారీ నారీ నడుమ మురారి

ఈ మూవీ సంక్రాంతికి కానుకగా జనవరి 15న విడుదలయ్యింది. అయితే జనవరి 14 సాయంత్రం నుంచే ప్రీమియర్స్ తో ప్రదర్శించబడింది. ఇప్పటి వరకు 20 రోజులు పూర్తి చేసుకుంది. సినిమా విడుదలైన 20 రోజులకే  ఓటీటీలోకి రావడం గమనార్హం. అమెజాన్‌ ప్రైమ్‌లో బుధవారం నుంచే స్ట్రీమింగ్‌ అవుతుంది. థియేటర్లలో క్లోజ్‌ కావడంతో ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. అయితే ముందు అగ్రిమెంట్‌ ప్రకారమే ఈ సినిమా ఓటీటీలోకి రావడం విశేషం. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.

34
నారీ నారీ నడుమ మురారి ఫైనల్‌ కలెక్షన్లు

ఇదిలా ఉంటే థియేట్రికల్‌గా `నారీ నారీ నడుమ మురారి` మూవీ క్లోజ్‌ అయినట్టే. ఇండియాలో ఈ మూవీ రోజుకి ఇరవై లక్షల వరకు కలెక్షన్లని వసూలు చేసింది. అయితే షేర్‌ కూడా చాలా తక్కువగా ఉంది. చాలా చోట్ల జీరో షేర్‌ అని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ సినిమాకి ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే, కలెక్షన్ల సైట్‌ టాలీవుడ్‌ టూ బాలీవుడ్‌ అందించిన లెక్కల ప్రచారం ఇప్పటి వరకు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 36కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. సుమారు రూ.19కోట్ల షేర్‌ కలెక్షన్లని రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో దీనికి సుమారు రూ.15కోట్ల షేర్‌ వస్తే, ఓవర్సీస్‌, ఇతర భాషల్లో కలుపుకుని నాలుగున్నర కోట్ల షేర్‌ వచ్చింది. దీంతో ఆల్మోస్ట్ ఇరవై కోట్ల షేర్‌ సాధించిందని చెప్పొచ్చు.

44
నారీ నారీ నడుమ మురారి మూవీకి లాభాల పంట

శర్వానంద్‌ హీరోగా వచ్చిన `నారీ నారీ నడుమ మురారి` మూవీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.11కోట్లు. ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ దాటుకుని ఏకంగా రూ.9కోట్ల వరకు లాభాలు తెచ్చిపెట్టింది. మంచి హిట్‌ కొట్టిందని చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ వచ్చింది. కానీ థియేటర్లు సరిపడా లేకపోవడంతో కలెక్షన్లు తగ్గాయి. లేదంటే ఈజీగా వంద కోట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories