బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ తెలియని వాళ్లు ఉండరు. ఈ ముద్దుగుమ్మ అనేక బాలీవుడ్ క్రేజీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. రణబీర్ కపూర్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘రాక్ స్టార్’తో సహా అనేక సినిమాల్లో నటించి మెప్పించింది .
ఇక నర్గీస్ ఫక్రీ సోదరి అలియా అమెరికాలో అరెస్టయ్యింది. జంట హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమెను న్యూయార్క్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. గత నెల మాజీ బాయ్‌ఫ్రెండ్, అతడి స్నేహితురాలిని అలియా సజీవదహనం చేసినట్లు ఆరోపణలున్నాయి.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు న్యూయార్క్‌లో ఉంటున్న అలియా ఫక్రీ కొంతకాలం పాటు ఎడ్వర్డ్ జాకోబ్ అనే యువకుడితో డేటింగ్‌లో ఉంది. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాది క్రితం విడిపోయారు. అనంతరం జాకోబ్‌కు అనాస్టాసియా ఎటినీ అనే యువతితో పరిచయమైంది. వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుసుకున్న అలియా పలుమార్లు తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై బెదిరింపులకు పాల్పడింది.
ఈ క్రమంలోనే నవంబరు 2న జాకోబ్, ఆయన స్నేహితురాలు ఉంటున్న భవనం వద్దకు వెళ్లి ఆ ఇంటికి నిప్పంటించింది. దీన్ని గమనించిన స్థానికులు వారిని అప్రమత్తం చేశారు. అయితే అప్పటికే మంటల్లో చిక్కుకుని వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా అలియా ఫక్రీని అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె దోషిగా తేలితే జీవితఖైదు పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆమెను రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణను డిసెంబరు 9వ తేదీకి వాయిదా వేశారు.
సోదరి అరెస్టుపై నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) ఇంకా స్పందించలేదు. అయితే, గత 20 ఏళ్లుగా నటి తన సోదరికి దూరంగా ఉంటోందని, వీరిద్దరూ టచ్‌లో లేరని నర్గీస్ చెందిన వారు చెబుతున్నాయి. నర్గీస్ తల్లి మాట్లాడుతూ.. తన కూతురు ఇలా చేయలేదని తెలిపారు. ఆమె అందరికీ సహాయం చేస్తుంది. ఇతరులను కూడా బాగా చూసుకుంటుంది అని ఆమె చెప్పుకొచ్చారు. మీడియా కథనాలతోనే నర్గీస్ కు కూడా తన సోదరి అరెస్టు విషయం తెలిసిందట.
నర్గీస్ ఫక్రీ సినిమాల విషయానికి వస్తే... త్వరలో హౌస్‌ఫుల్ 5 సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతోంది. 2011లో విడుదలైన రణ్‌బీర్ ‘రాక్‌స్టార్’ ఆమె మొదటి చిత్రం. ‘రాక్‌స్టార్’ ద్వారా నర్గీస్‌కు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ‘అజర్’, ‘డిషూమ్’ సహా పలు పెద్ద సినిమాల్లో నటించి బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.