Allu Arjun, Highest Tax Payer, Tollywood
అల్లు అర్జున్ టైటిల్ రోల్‌లో నటించిన ప్రాంచైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) మరి కొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో సినిమాపై హైప్ మామూలుగా లేదు. అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక ట్రెండింగ్ లో ఉన్నారు. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ కు చెందిన ఓ విషయం అభిమానులు పండుగ చేసుకునేది బయిటకు వచ్చింది.
Pushpa 2, Telangana High Court, allu arjun, ticket rates
ఫార్చ్యూన్ ఇండియా భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే సినీ ప్రముఖుల జాబితాను ప్రకటించింది. మన టాలీవుడ్ స్టార్స్ లో అల్లు అర్జున్ టాప్ లో ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఐకాన్ స్టార్ 2023-24లో ఏకంగా రూ.14 కోట్ల మేర అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్లు ఫార్చూన్ ఇండియా నివేదిక తెలిపింది. టాప్ 20 జాబితాలో అల్లు అర్జున్ 16వ స్థానం దక్కించుకున్నారు.
Pushpa 2, allu arjun, sukumar, OTT Release
ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ విషయం ఏమిటి అంటే ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోల పేర్లు టాప్ 20 జాబితాలో లేకపోవడం. మరో ప్రక్క షారూఖ్ ఖాన్ – 92 కోట్లు చెల్లించి ఫస్ట్ ప్లేస్ ను సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే షారూక్ ఖాన్ సినిమాలతో పాటు మరికొన్ని వ్యాపారాలు చేస్తున్నాడు. దాంతోపాటు యాడ్స్ ద్వారా కూడా అదనపు ఆదాయం వస్తుంది. దీంతో భారీగా ఆదాయం సమకూరుతుంది. అందుకే ఈ స్థాయిలో ఆదాయపు పన్ను చెల్లించాడు.
Allu Arjun, #Pushpa2, sukumar
ఇక దళపతి విజయ్ సంగతి చూస్తే.. ఆయన 80 కోట్లు ఇన్ కం ట్యాక్స్ గా చెల్లించారు. ఈ విషయంలో ఆయన బాలీవుడ్ స్టార్స్ తో పోటీ పడినట్టే. మొత్తానికి సెకండ్ ప్లేస్ లో నిలిచారు. సల్మాన్ ఖాన్ 75 కోట్లు చెల్లిస్తే.. అమితాబ్ బచ్చన్ 71 కోట్లు ట్యాక్స్ గా పే చేశారు. వీళ్ల తరువాతి మూడు స్థానాలు బాలీవుడ్ స్టార్స్ వే. వాళ్ల లిస్టు చూస్తే.. అజయ్ దేవగన్ – 42 కోట్లు, రణబీర్ కపూర్ – 36 కోట్లు, హృతిక్ రోషన్ – 28 కోట్లను ఆదాయపు పన్నుగా చెల్లించారు.
హీరోయిన్ల విషయానికి వస్తే... ఫార్చ్యూన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. కరీనా కపూర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 20 కోట్ల పన్ను చెల్లించి జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక కియారా అద్వానీ 12 కోట్లతో 14వ స్థానంలో ఉంది. కత్రినా కైఫ్ 11 కోట్లు ట్యాక్స్ చెల్లించి టాప్ 20 లో స్థానం సంపాదించింది.
pushpa 2
ఇక కంక్లూజన్ ఏమిటంటే..2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు రూ. 92 కోట్ల పన్నులు చెల్లించి.. షారుక్ ఖాన్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. ఆ తర్వాత స్థానం మాత్రం సౌతిండియా స్టార్ దే. ఈమధ్యే రాజకీయాల్లోకి వచ్చిన తమిళ స్టార్ హీరో.. తలపతి విజయ్ సుమారు రూ.80 కోట్లు పన్నులుగా చెల్లించారు.
ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో దాదాపు రూ.75 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించిన సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో నిలిచాడు. వీరితోపాటు అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, రణబీర్ కపూర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ లిస్టులో ఉన్నారు.