దశాబ్దాల నుంచి సినిమాకు, రాజకీయాలకు బలమైన కనెక్షన్ ఉంది. వెండితెర వేల్పులుగా వెలిగిన ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి వారంతా రాజకీయాల్లో సైతం జయకేతనం ఎగురవేశారు. చిరంజీవి, కమల్ హాసన్ పాలిటిక్స్ ని టచ్ చేశారు. ప్రముఖ రాజకీయ నేతల వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.