ఎన్టీఆర్‌ ఇంట్లో అత్యంత ఖరీదైన లగ్జరీ కారు.. ఇండియాలోనే ఫస్ట్ పర్సన్‌గా `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ రికార్డ్.. ?

Published : Aug 18, 2021, 02:16 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌  రికార్డ్ సృష్టించారు. ఇండియాలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ కారుని సొంతం చేసుకున్నారు. ఈ కారుని పొందిన మొదటి ఇండియన్‌గా ఎన్టీఆర్‌ నిలవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..   

PREV
18
ఎన్టీఆర్‌ ఇంట్లో అత్యంత ఖరీదైన లగ్జరీ కారు.. ఇండియాలోనే ఫస్ట్ పర్సన్‌గా `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ రికార్డ్.. ?

ఎన్టీఆర్ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్‌ షెడ్యూల్‌ ఉక్రెయిన్‌లో జరుగుతుంది. ఈ షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్నారు తారక్‌. దీంతో తిరిగి హైదరాబాద్‌కి వచ్చేశారు. 

28

ఆయన హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయిన సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వైట్‌ టీషర్ట్ , బ్లూ జీన్స్, బ్లాక్‌ మాస్క్, హ్యాట్‌ ధరించారు ఎన్టీఆర్‌. స్టయిల్‌గా ఉన్నారు. 

38

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌కి సంబంధించిన మరో విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్‌ లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. `లాంబోర్గిన ఉరస్‌ గ్రాఫిటే క్యాప్సుల్‌` కారుని కొన్నారు ఎన్టీఆర్‌.

48

ప్రస్తుతం అది ఇంటికి చేరింది. ఎన్టీఆర్ ఇంటి ముందు హుందాగా నిల్చొని ఉంది. ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. హల్‌చల్‌ చేస్తున్నాయి. 

58

ఇండియాలోనే ఈ కారుని కొన్న  ఫస్ట్ హోనర్‌ గా ఎన్టీఆర్‌ నిలిచారనే వార్తలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. దీని విలువ సైతం ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతుంది. 

68

ఏకంగా 3.16కోట్లు ఉంటుందని టాక్. ఇండియాలో ఇప్పటి వరకు ఇంతటి లగ్జరీ కారుని ఎవరూ కొనలేదని, ఎన్టీఆర్‌ మాత్రమే దక్కించుకున్నారని ఆయన అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 

78

ఒకప్పుడు హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ కొన్న ఫస్ట్ హీరోగా ఎన్టీఆర్‌ నిలిచారని, ఇప్పుడు కారు విషయంలోనూ ఆయనే ఫస్ట్ అంటూ తారక్‌ ఫ్యాన్స్ సంబపరడుతున్నారు. ఈ కారు చిత్రాలను ట్రెండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఎన్టీఆర్‌ కొత్త కారు కొన్నారనే వార్తలు రాగా,వాటిలో నిజం లేదన్నారు. మరి ఇప్పుడెలా స్పందిస్తారో చూడాలి.
 

88

ఇక ఎన్టీఆర్‌ `ఆర్ఆర్‌ఆర్‌` షూటింగ్‌ని పూర్తి చేసుకున్నారు. మరోవైపు త్వరలోనే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం ప్రారంభించనున్నారు. దీంతోపాటు ఆయన టీవీ హోస్ట్ గా చేస్తున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` ప్రోగ్రామ్‌ ఈ నెల 22న జెమినీ టీవీలో ప్రసారం కాబోతుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories