ఈ సందర్భంగా నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు సరదాగా ఓ ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్ ఆంధ్ర వంటకాల్లో ఇష్టమైనవి, ఇష్టమైన ప్రదేశాల గురించి మాట్లాడారు. తనకి ఏపీలో ఉలవచారు, ఉలవచారు బిర్యానీ అంటే ఇష్టం అని లోకేష్ పేర్కొన్నారు. అన్ని ప్రశ్నలకు వెంటవెంటనే సమాధానాలు ఇచ్చిన లోకేష్ కి చివర్లో మాత్రం పరీక్ష ఎదురైంది.