కమల్ హాసన్ కు కూడా సాధ్యం కాలేదు, ఒక్క సినిమాలో 45 పాత్రలు చేసిన నటుడు ఎవరో తెలుసా?

Published : Mar 08, 2025, 08:48 PM IST

ఒక్క సినిమాలో ఎక్కువ పాత్రల్లో నటించిన హీరో ఎవరు అని అడిగితే.. వెంటనే కమల్ హాసన్ పేరు చెపుతారు. కాని కమల్ కంటే కూడా ఎక్కువ పాత్రలు చేసిన నటుడు మరొకరు ఉన్నారంటే నమ్ముతారా? 

PREV
15
కమల్ హాసన్ కు కూడా సాధ్యం కాలేదు, ఒక్క సినిమాలో 45 పాత్రలు చేసిన నటుడు ఎవరో తెలుసా?

ఒక సినిమాలో ఒక్క పాత్రలోనటించడం అంటేనే చాలా కష్టం. మేకప్ కాపాడుకోవాలి, రోజంతా మేకప్ లో ఉండటం, డైలాగ్స్, యాక్షన్స్ సీన్స్ ఇలా సినిమా వాళ్ల కష్టాలు చాలా ఉంటాయి. కాని అవి అందరికి కనిపించవు. ఒక సినిమాలో ఒక పాత్ర చేయడమే కష్టం హీరోలు డ్యూయల్ రోల్స్, త్రిపుల్ రోల్స్ కూడా చేస్తుంటారు ఆ పాత్రలు చేయడం కోసం మేకప్ మార్చుకోవడం, డైలాగ్ తీరు తెన్నులు మార్చడం, రకరకాల వేరియేషన్లు చూపించడం చాలా కష్టం.
 

25

అంత కష్టపడతారు కాబట్టే వాళ్ళు స్టార్లు అయ్యారు. అయితే వీటన్నింటికి మించి చేస్తుంటారు హీరో కమల్ హాసన్. ఆయన అయితే ఏకంగా పది పాత్రలు అద్భుతంగా నటించారు దశావతారం సినిమాలో. అన్నీ దేనికది డిఫరెంట్ గా ఉండటంతో పాటు. ఆ పాత్రలకోసం ఆయన ఎంత కష్టపడ్డారు అనేది కూడా చూపించారు. అయితే ఒక్క సినిమాలో ఎక్కువ పాత్రలు నటించిన హీరో ఎవరు అంటే కమల్ పేరే ముందు ఉంటుంది.

35
Kamal Haasan

కాని అసలే నిజంఅది కాదు. కమల్ హాసన్ ను మించిపోయాడు ఓ నటుడు. కమల్ పది పాత్రలు చేస్తే ఆయన ఏకంగా ఒక సినిమాలో 45 పాత్రలు చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ఇంతకీ అతను ఎవరో తెలుసా? 

45

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  ఎంతో మంది స్టార్ నటుడు ఉన్నారు. గొప్ప గొప్ప పాత్రలు చేసినవాళ్లు ఉన్నారు. పాత్రల్లో ప్రయోగాలు చేసిన వాళ్లు ఉన్నారు. ఎక్కువ పాత్రలు చేసిన వాళ్లు ఉన్నారు. కాని ఒక సినిమాలో ఏకంగా 45 పాత్రలు చేసిన నటుడిని ఏమనాలో కూడా అర్ధం కావడంలేదు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?ఇంతకీ ఒక్క సినిమాలో ఎక్కువ పాత్రలు చేసిన  వ్యక్తి ఎవరో కాదు అది జాన్సన్ జార్జ్. ఆయన  మలయాళ నటుడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 పాత్రలు పోషించి గిన్నిస్ రికార్డు సృష్టించాడు.

55

నటుడు జాన్ జార్జ్ 2018లో విడుదలైన మలయాళ చిత్రం "ఆరను జన్"లో 45 పాత్రలు పోషించారు. ఇందులో గాంధీ, జీసస్ క్రైస్ట్, డావిన్సీ, హిట్లర్, వివేకానంద మొదలైన పాత్రలు ఉన్నాయి. ఇది ఆ సంవత్సరం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది.  ఇలా దేశంలో  ఎంతో మంది గొప్ప నటులు కూడా సాధించలేని రికార్డ్ ను జాన్ జార్జ్  సాధించాడు. 

Read more Photos on
click me!

Recommended Stories