`పాడుతా తీయగా`లో మరో బాగోతం, గిఫ్ట్స్ ఇస్తే ఫేవర్‌గా జడ్జ్ మెంట్‌.. లేడీ సింగర్ మరో సంచలన ఆరోపణ

Singer Pravasthi Aradhya: తెలుగు టెలివిజన్‌ షోస్‌లో సింగర్స్ పరంగా, కొత్త టాలెంట్‌ని వెలికితీసే విషయంలో `పాడుతా తీయగా` షో ప్రముఖంగా నిలుస్తుంది. హై స్టాండర్డ్స్ ఉన్న షోగానూ పేరుతెచ్చుకుంది. ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి లెజెండ్స్ దీనికి జడ్జ్ గా వ్యవహరించిన నేపథ్యంలో ఉన్నత విలువలతో కూడిన షోగా పాపులర్‌ అయ్యింది. ఇందులో టాలెంట్‌ నిరూపించుకున్న సింగర్స్ ఇప్పుడు స్టార్ సింగర్స్ గా రాణిస్తున్నారు. కానీ తాజాగా యంగ్‌ సింగర్‌ ప్రవస్తి ఆరాధ్య చేసిన ఆరోపణలు పెద్ద దుమారం రేపుతున్నాయి. 

Giving gifts is judgement as a favor singer pravasthi aradhya one more allegation on padutha theeyaga judges in telugu arj
singer pravasthi aradhya (Rtv)

Singer Pravasthi Aradhya: ఈటీవీలో ప్రసారమయ్యే `పాడుతా తీయగా` ప్రోగ్రామ్‌పై సింగర్‌ ప్రవస్తి ఆరాధ్య చేసిన ఆరోపణలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారుతున్నాయి. తనకు అన్యాయం చేశారని, హేళనగా చూశారని, బాడీ షేమింగ్‌ కామెంట్స్ చేశారని,

తనని కావాలనే ఎలిమినేట్‌ చేశారని ప్రవస్తి ఆరాధ్య చేసిన ఆరోపణలు అందరికి షాకిస్తున్నాయి. అంతేకాదు ఏకంగా జడ్జ్ లుగా ఉన్న కీరవాణి, చంద్రబోస్‌, సునీతలపై ఆమె షాకింగ్‌ అలిగేషన్‌ చేసింది. 

Giving gifts is judgement as a favor singer pravasthi aradhya one more allegation on padutha theeyaga judges in telugu arj
singer pravasthi aradhya (RTV)

ఈ మేరకు సింగర్‌ ప్రవస్తి ఓ వీడియోని తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పంచుకుంది. పాడుతా తీయగా షోలో తెరవెనుక ఏం జరుగుతుందో బాగోతం మొత్తం బయటపెట్టింది. తనకు అనుకూలమైన వారిని విన్నర్‌ని చేసి నచ్చని వారిని ఎలా ఎలిమినేట్‌ చేస్తారో తెలిపింది ప్రవస్తి.

సునీతపై ఆమె షాకింగ్‌ కామెంట్స్ చేసింది. తనంటే ఆమెకి నచ్చదని, కావాలని పాయింట్‌ తీసి తప్పులు వెతుకుతుందని చెప్పింది. తన బాడీ గురించి తప్పుగా మాట్లాడిందని తెలిపింది. 
 


Padutha Theeyaga

ఈ క్రమంలో మరో షాకింగ్‌ కామెంట్స్ చేసింది. గిఫ్ట్స్ ఇస్తే ఫేవర్‌గా జడ్జ్ మెంట్‌ ఇస్తారంటూ మరో బాంబ్‌ పేల్చింది. మనీ మ్యాటర్‌ ప్రస్తావనకు తెచ్చిన ఆమె ఈ పోటీలో భాగంగా జడ్జ్ లు సింగర్స్ తో క్వచ్చన్స్ అడిగే రౌండ్‌ ఒకటి ఉంటుందట.

ఆ సమయంలో కొందరు సింగర్స్ జడ్జ్‌ లకు గిఫ్ట్ ఇస్తుంటారని, అలా ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చిన వారికి జడ్జ్ మెంట్ కాస్త ఫేవర్‌గా ఉంటుందని ఆమె కామెంట్ చేయడం షాకిస్తుంది. `ఆర్‌టీవీ`లో మాట్లాడుతూ సింగర్‌ ప్రవస్తి ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.  

అయితే ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. జడ్జ్‌ లు ఇలా పర్సనల్‌గా టార్గెట్‌ చేయడమనేది ఉంటుందని తాను అనుకోవడం లేదని, కానీ ప్రొడక్షన్‌ కంపెనీనే ఇవన్నీ చేయిస్తుందని తెలిపింది. జ్ఞాపిక ప్రొడక్షన్‌ వాళ్లు దీన్ని నిర్వర్తిస్తుంటారని, ఆ ప్రొడక్షన్‌ వాళ్లే ఇవన్నీ చేస్తారని, జడ్జ్ ల చేత చేయిస్తారని తెలిపింది.

`పాడుతా తీయగా` కార్యక్రమంలో కూడా అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని చెప్పడం షాకిస్తుంది. కీరవాణి, సునీత, చంద్రబోస్‌ తమతో అలా మాట్లాడటానికి కారణం ప్రొడక్షన్‌ హౌజ్‌ వాళ్లే అని తెలపడం గమనార్హం. 

singer pravasthi aradhya (RTV)

ఎలిమినేషన్‌ కూడా వాళ్లు చెప్పిన వాళ్లనే ఎలిమినేషన్‌ చేస్తారని, వాళ్లు ఎలిమినేట్‌ చేయాలనుకున్న సింగర్స్ కి చివరి నిమిషంలో సాంగ్స్ మార్చేశారని, ఇలాంటి సమయంలో ఆ పాటలు ప్రాక్టీస్‌ చేయడానికి టైమ్‌ లేక సరిగా పాడలేకపోతారని, అలా ఎలిమినేషన్‌ జరుగుతుందని చెప్పింది ప్రవస్తీ.

ఇటీవల అదే జరిగిందని, షూట్‌ రెండు రోజులు ఉందనగా ఇద్దరికి సాంగ్స్ మార్చేశారని తెలిపింది. తాను ఎలిమినేషన్‌ సమయంలో సునీత తనపై చేసిన కామెంట్‌ని నిలదీయాలని ప్రయత్నించినా, చరణ్‌ సార్‌ తనకు మైక్‌ ఇవ్వలేదని తెలిపింది ప్రవస్తి ఆరాధ్య. ఆర్‌టీవీలో ఆమె చేసిన ఈ కామెంట్స్ కూడా ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. 

read  more: 'పాడుతా తీయగా' షోలో చీకటి కోణం, ఎక్స్ ఫోజింగ్ చేయమంటారు.. సునీత, కీరవాణిపై లేడీ సింగర్ కామెంట్స్

also read: ఆసుపత్రి పాలైన యాంకర్‌ రష్మి, అసలు సమస్య ఇదే.. మళ్లీ తిరిగి షోస్‌ చేసేది ఎప్పుడంటే?
 

Latest Videos

vuukle one pixel image
click me!