బిగ్ బాస్ శ్రీసత్యకు అన్యాయం చేసిన టిల్లుగాడు... పాపం మొత్తంగా లేపేశారా!

Published : Apr 02, 2024, 03:32 PM IST

 బిగ్ బాస్ శ్రీసత్య టిల్లు స్క్వేర్ మూవీలో తళుక్కున మెరిసింది. అయితే ఆమెకు సంబంధించిన సన్నివేశాలు సినిమా నుండి లేపేశారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది ఆమెను నిరాశపరిచే అంశమే...   

PREV
16
బిగ్ బాస్ శ్రీసత్యకు అన్యాయం చేసిన టిల్లుగాడు... పాపం మొత్తంగా లేపేశారా!
Srisatya


బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న శ్రీసత్య చివరి వారం వరకు హౌస్లో ఉంది. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఇంటికి పంపారు. ఫినాలేకి వెళ్లే ఛాన్స్ శ్రీసత్య కోల్పోయింది. శ్రీసత్య గేమ్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. 


 

26
Sreesatya

శ్రీసత్య తెలివిగా అబ్బాయిలను వాడుకుని గేమ్ ఆడుతుందనే వాదనలు వినిపించాయి. అర్జున్ కళ్యాణ్ ని తన చుట్టూ తిప్పకుంది. మనోడు గేమ్ కూడా ఆడకుండా ఆమె జపం చేశాడు. దాంతో త్వరగా ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత శ్రీహాన్ కి దగ్గరైంది. 

36


శ్రీహాన్ కి క్లోజ్ అయ్యాక అతడి గేమ్ కూడా దెబ్బతింది. ఫ్యామిలీ వీక్ లో హౌస్లోకి వెళ్లిన శ్రీహాన్ ప్రియని సిరి మనోడికి క్లాస్ పీకింది. ఆమెకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చింది . అప్పుడు మనోడు ట్రాక్ లో పడ్డాడు. శ్రీహాన్ విన్నర్ కావాల్సి ఉండగా నాగార్జున ఆఫర్ చేసిన డబ్బులు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు. 

46
Srisatya

ఇదిలా ఉంటే శ్రీసత్యకు చిత్రాల్లో అడపాదడపా ఆఫర్స్ వస్తున్నాయి. కాగా టిల్లు స్క్వేర్ మూవీలో ఆమె నటించింది. అయితే ఒక పాటలో మాత్రమే ఆమె కనిపించింది. ఆమెకు ఎలాంటి డైలాగ్స్, సన్నివేశాలు లేవు. 

 

56
Srisatya

గతంలో శ్రీసత్య తాను టిల్లు స్క్వేర్ మూవీలో నటిస్తున్నట్లు చెప్పింది. తనకు హీరో సిద్ధూ జొన్నలగడ్డతో కాంబినేషన్ సన్నివేశాలు ఉన్నాయని, తనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కిందని చెప్పింది. మొదట్లో డైలాగ్స్ చెప్పడానికి కొంత తడబడ్డానని, తర్వాత సెటిల్ అయ్యానని చెప్పింది. 

66
Srisatya

తీరా మూవీ విడుదలయ్యాక చూస్తే శ్రీసత్య సన్నివేశాలు లేవు. దీంతో టిల్లు స్క్వేర్ నుండి నుండి శ్రీసత్య సీన్స్ ఎడిటింగ్ లో లేపేశారని తెలుస్తుంది. ఇది ఒకింత ఆమెను నిరాశపరిచే అంశమే అని చెప్పాలి. సూపర్ హిట్ టిల్లు స్క్వేర్ లో ఆమెకు సన్నివేశాలు ఉండి ఉంటే కెరీర్ కి ప్లస్ అయ్యేది.

click me!

Recommended Stories