Nani The Paradise: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమా గ్లింప్స్ విడుదల కానుంది. ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో 8 భాషల్లో విడుదల కానుంది, దసరాను మించిన వైలెన్స్ ఉంటుందని సమాచారం.
Nani The Paradise makers are aiming for a market beyond India in telugu
Nani The Paradise: ‘దసరా’ సినిమాతో అభిమానులను, సినిమా లవర్స్ ని ఆశ్చర్యానికి గురిచేశారు నాని - శ్రీకాంత్ ఓదెల. ఎవరూ ఊహించని లుక్ లో నాని ఇమేజ్‌ని తెరపై ఆవిష్కరించారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ‘ది ప్యారడైజ్’ (The Paradise ) చిత్రంతో మరోసారి ‘దసరా’ (Dasara) టీమ్ జట్టు కట్టింది.
బోల్డ్ అండ్ వైల్డ్ అంటూ ఈసారి ఇంకొంచెం స్పెషల్ గా గా నానిని తెరపై చూపించనున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమాని కూడా ప్యాన్ ఇండియా స్దాయిలో కాకుండా ప్యాన్ వరల్డ్ లెవిల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని ఎనిమిది భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
23
Nani The Paradise makers are aiming for a market beyond India in telugu
మార్చి 3న ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేయనున్నారు. ఈ గ్లింప్స్ ఎనిమిది భాషల్లో(తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్) విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే గ్లింప్స్ లోనే ఎంత వైలెంట్ గా ఈ సినిమా ఉండబోతోందనే విషయాన్ని చెప్పబోతున్నారు. అది దసరాని మించి నాలుగైదు రెట్లు ఉంటుందని అంటున్నారు.
ఇది విన్న వాళ్లంతా ఈ సినిమా రీసెంట్ గా వచ్చిన మళయాళ చిత్రం మార్కో, హిందీ చిత్రం కిల్ ని గుర్తు చేస్తుందని అంచనా వేస్తున్నారు. కథ వేరేది అయినా అందులో క్రైమ్, హింస ఆ స్దాయిలో ఉంటాయని సోషల్ మీడియాలో లెక్కలు వేస్తున్నారు.
33
Nani The Paradise makers are aiming for a market beyond India in telugu
ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే కథ ఇది. నాని (Nani)లుక్ , ఆయన డైలాగులు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించనున్నట్టు సమాచారం.