నేచురల్ స్టార్ నాని తన ప్రాజెక్టుల విషయంలో చాలా క్లారిటీగా ముందుకు వెళ్తున్నారు. తన ఫ్యామిలి ఇమేజ్ నుంచి బయిటకు రావటం కోసం కామెడీ సినిమాలను పూర్తిగా ప్రక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా అలాంటి స్క్రిప్టుని చేయనని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఎవరిదా స్క్రిప్టు
Nani shelves Cibi Chakaravarthi Film before Start in telugu
నేచురల్ స్టార్ నాని తన ప్రాజెక్టుల విషయంలో చాలా క్లారిటీగా ముందుకు వెళ్తున్నారు. ఎన్ని కథలు విన్నా, ఎందరు డైరక్టర్ లు ఎప్రోచ్ అయినా తన అనుకున్న పంధాలోనే ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే హిట్: ది థర్డ్ కేస్ షూటింగ్ పూర్తి చేసారు . ఈ చిత్రం మే 1 న విడుదల కానుంది.
అలాగే ఇప్పటికే 'ది ప్యారడైజ్'ని ప్రకటించాడు, అయితే ఈ సినిమాకు భారీగా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ అవసరం కారణంగా ఇది ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఇదే సమయంలో తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో ఓ నిర్ణయాలకి వచ్చేసి యస్, నో చెప్పేస్తున్నారు.
వారిని పెండింగ్ లో పెట్టడం లేదు. అలాగ చాలా కాలంగా తన డేట్స్ ఎదురుచూస్తున్న ఓ డైరక్టర్ కు చేయనని క్లారిటీగా చెప్పేసారని తెలుస్తోంది. ఎవరా డైరక్టర్, ఏమా కథ
23
Nani shelves Cibi Chakaravarthi Film before Start in telugu
ఆ మధ్యన ఇద్దరు ముగ్గురు డైరక్టర్స్ తో చర్చలు జరిపారు. అయితే కథ నచ్చకో, బడ్జెట్ నచ్చకో ప్రక్కన పెట్టేసారు. కానీ తాజాగా తన ఇమేజ్ ని మార్చుకోవటం కోసం ఓ స్క్రిప్టు కు నో చెప్పారని తెలుస్తోంది. ఎవరా దర్శకుడు అంటే
ఆ మధ్యన సుజీత్‌తో కమిట్ అయ్యాడు. ఆ మేరకు సుజీత్ తో చర్చలు కూడా జరిగాయి. అయితే సుజీత్ ...పవన్ కళ్యాణ్ OG షూటింగ్ పూర్తి చేయాల్సి ఉన్నందున ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతోంది. ఈ గ్యాప్ లో చాలా కాలంగా చర్చలు జరుపుతున్న సిబి చక్రవర్తి సినిమాను టేకప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడా సినిమాని అటకెక్కించారని తెలుస్తోంది.
అందుకు ఏకైక కారణం తను ఫ్యామిలి హీరో ఇమేజ్ నుంచి బయిటకు రావటం కోసం కామెడీ సినిమాలను పూర్తిగా ప్రక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా అలాంటి స్క్రిప్టుని చేయనని తేల్చి చెప్పినట్లు సమాచారం.
33
Nani shelves Cibi Chakaravarthi Film before Start in telugu
డాన్ సూపర్ సక్సెస్ తర్వాత సిబి చక్రవర్తి తమిళ నిర్మాతల నుండి చాలా అడ్వాన్సులు తీసుకున్నాడు. అయితే తన తదుపరి చిత్రానికి హీరో ఖరారు చేయకపోవడంతో వేచి చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో సిబి చక్రవర్తి తెలుగు సినిమాకి వచ్చారు. అయితే అప్పటి పరిస్దితులు వేరు. ఇప్పుడు కామెడీ, ప్యామిలీ ఇమేజ్ నుంచి బయిటకు వచ్చి యాక్షన్ సినిమాలు చేయాలని నానీ ఫిక్స్ అయ్యారట. దానికి తోడు సిబి చక్రవర్తి బడ్జెట్ బాగా ఎక్కువ చెప్పారట.
ఈ క్రమంలో నాని, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి మాట్లాడుకుని ఓ డెసిషన్ తీసుకున్నారట. తమ సినిమా ప్రారంభానికి ముందే ఎటువంటి గందరగోళంలో పడకుండా ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పుడు శ్రీకాంత్ ఒదెల కోసంవెయిట్ చేస్తున్నారు. ది ప్యారడైజ్ షూటింగ్ ప్రారంభించాలి. ఈలోగా,నాని కోర్ట్, HIT 3ని ప్రమోట్ చేస్తాడు. గ్యాప్ లలో అతను కొత్త స్క్రిప్ట్‌లను కూడా వింటాడు.