అయితే ఇటీవల జరిగిన హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తప్పిదం జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం రోజు వైజాగ్ లో హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.హాయ్ నాన్న ఈవెంట్ లో యాంకర్ సుమ స్క్రీన్ పై కొన్ని ఫోటోలు చూపిస్తూ వాటిపై స్పందించాల్సిందిగా మృణాల్ ఠాకూర్ ని కోరింది. నాని, నజ్రియా, దుల్కర్ సల్మాన్ ఫోటోలు చూపించారు. తనకి తోచిన విధంగా మృణాల్ కామెంట్ చేసింది. కానీ ఒక్కసారిగా స్క్రీన్ పై రష్మిక, విజయ్ దేవరకొండ పర్సనల్ ప్రైవేట్ పిక్స్ ప్రత్యక్షం అయ్యాయి.