లాల్ రంగ్ శారీలో లావణ్య త్రిపాఠి రాయల్ లుక్.. మెగా కోడలు బ్యూటీఫుల్ ఫోజులకు ఫిదా అవ్వాల్సిందే..

First Published | Dec 2, 2023, 8:54 PM IST

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత  బ్యూటీఫుల్ లుక్స్ లో నెట్టింట అదరగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా చీరకట్టులో రాయల్ లుక్ తో కట్టిపడేసింది. 
 

యూపీ బ్యూటీ, లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ ఈనెల మొదటి వారంలో పెళ్లి పీటలు ఎక్కారు. 
 

వరుణ్ - లావణ్య పెళ్లి ఇటలీలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించారు. అయితే వీరి పెళ్లికి ప్రత్యేకమైన దుస్తుల్లో ఆకర్షించారు. బ్యూటీఫుల్ అవుట్ ఫిట్లలో ఆకట్టుకున్నారు. 


దీపావళికే మెగా కోడలిగా కొణిదెల వారింట అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే పెళ్లి బిజీ నుంచి ఫ్రీ అయ్యి.. తన అభిమానులతో మెమోరబుల్ మూవెంట్స్ ను పంచుకుంటోంది. ప్రస్తుతం బ్యూటీఫుల్ అవుట్ ఫిట్లలోని తన ఫొటోలను షేర్ చేస్తోంది. 
 

ఇప్పటికే స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో మెగా కోడలు ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సూపర్ గా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. వరుస ఫొటోలతో కట్టిపడేస్తోంది. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో మెరిసింది. సంప్రదాయ దుస్తుల్లో లావణ్య త్రిపాఠి అచ్చమైన తెలుగమ్మాయిలా ఆకట్టుకుంది. రెడ్ శారీలో రాయల్ లుక్ ను సొంతం చేసుకుంది. తన బ్యూటీఫుల్ స్టిల్స్ తో కట్టిపడేసింది. 

తన పెళ్లికి సంబంధించిన అదిరిపోయే అవుట్ ఫిట్లలో లావణ్య చాలా అందంగా మెరిసింది. ఆ ఫొటోలను ప్రస్తుతం అభిమానులతో షేర్ చేసుకుంటూ ఆకట్టుకుంటోంది. తన అందంతో మరింతగా ఆకర్షిస్తోంది. 

లావణ్య పంచుకుంటున్న ఫొటోలను అభిమానులు క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. లైక్స్, కామెంట్లతో మెగా కోడలిని మరింతగా పోగుడుతున్నారు. ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

ఇక లావణ్య చివరిగా ‘హ్యాపీ బర్త్ డే’ అనే చిత్రంతో అలరించింది. లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన ఈ మూవీ ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళంలో ‘తనాల్’లో నటిస్తోంది. అలాగే ‘పులిమేక’ అనే వెబ్ సిరీస్ తోనూ అలరించింది. 

Latest Videos

click me!