అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ యాంకర్‌గా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు పూర్తిగా నటనకు ప్రయారిటీ ఇస్తుంది. ఆమెలోని నటిని బయటకు తీస్తుంది. డిఫరెంట్ రోల్స్ చేస్తూ మెప్పిస్తుంది. పాజిటివ్, నెగటివ్, బోల్డ్ రోల్స్ కూడా చేస్తుంది. కానీ రాను రాను తనలో అద్భుతమైన నటి ఉందనే విషయాన్ని చాటి చెబుతుంది.
మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో అలరిస్తుంది అనసూయ. ఈ క్రమంలో ఆమెపై అనేక నెగటివ్ కామెంట్స్ ట్రోల్స్ వస్తుంటాయి. ట్రోలర్స్ రియాక్ట్ కావడంతో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు తాను చాలా విషయాల్లో రియాక్ట్ కావడంతో వివాదాలు క్రియేట్ అవుతున్నాయి. దీంతో అనసూయ అంటే బోల్డ్ నెస్‌తోపాటు కాంట్రవర్సియల్ అనే ముద్ర పడింది. కానీ తాను ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. మెచ్యూర్డ్ గా ముందుకు సాగుతుంది.
అయితే అనసూయ కెరీర్‌కి సంబంధించిన ప్రారంభంలో జరిగిన స్ట్రగుల్స్ చాలానే ఉన్నాయట. ఆమె సర్వైవ్ అయ్యేందుకు ఇప్పటికీ స్ట్రగుల్స్ అవుతూనే ఉందని, చాలా ఫేస్ చేస్తూనే ఉంటుందని తెలిపారు రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్. అనసూయకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను, ఇప్పటి వరకు బయటకు రాని విషయాలను కూడా ఆయన వెల్లడించారు. `ట్యాగ్ తెలుగు` యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
బెజవాడ ప్రసన్న కుమార్ జబర్దస్త్ కి వర్క్ చేశాడు. అప్పట్నుంచి అనసూయతో పరిచయం ఉంది. `అలీ టాకీస్` చేసే సమయంలో తనకు కూడా స్కిట్లు చేసే అవకాశం వచ్చిందట. ఆ సమయంలో అనసూయకి తనే యాక్టింగ్ నేర్పించినట్టు తెలిపారు రైటర్ ప్రసన్న కుమార్. షూటింగ్‌లు అయిపోయాక.. రాత్రి ఏడు, ఎనిమిది గంటలకు తన వద్దకు వచ్చేదట. అర్థరాత్రి ఒంటి గంట వరకు తాము రిహార్సల్స్ చేసేవాళ్లమని, వాళ్ల భర్త బయటకు కారులో వెయిట్ చేసే వాళ్లని చెప్పాడు. అంతటి డెడికేషన్‌తో వర్క్ చేసినట్టు చెప్పాడు రైటర్.
Jabardasth Anasuya Bharadwaj
ఆ తర్వాత అనసూయ డెడికేషన్ గురించి అదిరిపోయే విషయాన్ని చెప్పాడు రైటర్. జెమినీ టీవీలో ఓ షో చేసే అవకాశం వచ్చిందట. అందుకోసం టెస్ట్ షూట్ చేయాలనుకున్నారు. కృష్ణభగవాన్, శ్రీనివాస్ రెడ్డి, రాంప్రసాద్, సుధీర్, గెటప్ శ్రీను ఇలా అంతా ఉన్నారట. అనసూయని యాంకర్‌గా అనుకున్నారట. చేస్తానని కూడా చెప్పిందట. అయితే పెట్టుకున్న షూట్ మొన్న డెలివరీ అయితే ఈ రోజు పెట్టారట. అంటే డెలివరీ అయిన రెండో రోజే ఆమె సెట్‌కి వచ్చిందట. అంతేకాదు ఏకంగా జిమ్‌కి వెళ్లి, బాడీ ఫిట్‌నెస్ కోసం కొన్ని ఎక్సర్‌సైజ్‌లు చేసి మూడో రోజు షోకి వచ్చిందట.
అక్కడ కూడా రూమ్‌లో బేబీ ఉంటే, ప్రతి అర్థగంటకి వెళ్లి ఫీడింగ్ చేస్తూ షూట్‌లో పాల్గొందట. ఆ టైమ్‌లో తన మాట మీద వచ్చేసిందని, ఇప్పటి వరకు `నాకు ఎంత ఇస్తున్నావని అడగలేదు, నేను ఇవ్వలేదు` అని తెలిపారు ప్రసన్న కుమార్. ఆమెని అంతా గ్లామర్ పరంగానూ చూస్తారని, కానీ ఇవన్నీ ఆమెకి చాలా చిన్నవిగా కనిపిస్తాయని, ఆమె ఆలోచనలు చాలా పెద్దగా ఉంటాయని తెలిపారు.
అంతేకాదు ఓ షాకింగ్ విషయం వెల్లడించారు. అనసూయ ఇండస్ట్రీలో చాలా టఫ్ఫెస్ట్ అమ్మాయి. ఇండస్ట్రీలో 250 మంది అమ్మాయిలు ఉన్నారంటే ఎవరూ ఆమెలా ఉండలేరని, ఆమె చాలా టఫ్ అని, ఆమెని ఎవరూ ఫ్లర్ట్ చేయలేరని, అది సాధ్యం కూడా కాదని, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుందని, అబ్బాయి ఎంత తోపు అయినా కానీ, ఎన్ని కోట్లు అయినా ఉండని, ఆమెని ఫ్టర్ట్ చేయలేరని, అంతటి స్ట్రాంగ్ ఉమెన్ తను అని గొప్పగా చెప్పుకొచ్చాడు ప్రసన్నకుమార్. ఇప్పటి వరకు కెరీర్ నెట్టుకొస్తున్న ఆమె వెనకాల ఎంతో స్ట్రగుల్ ఉందని చెప్పాడు. ఆయన కామెంట్స్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి.