తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఆ మూవీ బాలీవుడ్ లో డిజాస్టర్.. ఎందుకో చెబుతూ నాని షాకింగ్ కామెంట్స్

Published : May 06, 2025, 08:44 PM IST

తెలుగులో సంచలన విజయం సాధించిన ఒక చిత్రం బాలీవుడ్ లో డిజాస్టర్ గా నిలిచింది. అలా ఎందుకు జరిగిందో చెబుతూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

PREV
15
తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఆ మూవీ బాలీవుడ్ లో డిజాస్టర్.. ఎందుకో చెబుతూ నాని షాకింగ్ కామెంట్స్
Nani

నేచురల్ స్టార్ నాని 2019లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ చిత్రంలో తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్సులలో ఒకటిగా నిలిచే నటనను అందించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంది. తెలుగులో విడుదలైన తర్వాత రెండేళ్లకు అదే దర్శకుడు హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది.

 

25
Nani

ఇటీవల హిట్: ది థర్డ్ కేస్ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా, నాని ఓ ఇంటర్వ్యూలో హిందీ వెర్షన్ ఎందుకు సక్సెస్ కాలేదో వివరించారు. "అప్పుడు కోవిడ్ అయిపోయింది. జనం బయటికి రావడం మొదలు పెట్టారు. కానీ అప్పటికే లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే మంచి కంటెంట్ చూసే అలవాటు పడిపోయారు. వాళ్లు థియేటర్స్‌కు వెళ్లాలంటే మసాలా, ఎనర్జీ కావాలసింది. జెర్సీ ఒక గొప్ప సినిమా. హిందీలో కూడా గొప్పగానే ఉంది. కానీ ప్రేక్షకుల మూడ్ మారిపోయింది" అని నాని అన్నారు.

 

35
Jersey (2022)

అంతేకాదు, అదే సమయంలో KGF వంటి హై ఎనర్జీ సినిమాలు విడుదలవుతున్నాయని నాని పేర్కొన్నారు. "అప్పుడు ప్రజలు థియేటర్‌కు వెళ్తే వాళ్లకు ఎమోషన్ కంటే థ్రిల్, పవర్‌ఫుల్ మూమెంట్స్ కావాలి. అదే సమయంలో జెర్సీ విడుదలైంది. టైమింగ్, ప్లేస్‌మెంట్ వల్లే సినిమా ఫ్లాప్ అయింది. షాహిద్ ఒక అద్భుతమైన నటుడు. కానీ టైమింగ్ అనేది కీలకం," అని నాని వ్యాఖ్యానించారు.

 

45

ఈ హిందీ రీమేక్‌కు దర్శకత్వం గౌతమ్ తిన్ననూరి అందించగా, నిర్మాణ బాధ్యతలు నాగ వంశీ చేపట్టారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించారు. సినిమా బడ్జెట్ దాదాపు ₹80 కోట్లుగా ఉండగా, వసూళ్ల పరంగా ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

 

 

55
Nani

ఇక నాని ప్రొఫెషనల్ ఫ్రంట్ చూస్తే, ఇటీవల శ్రీనిధి శెట్టితో కలిసి నటించిన హిట్: ది థర్డ్ కేస్ సినిమాలో కనిపించారు. మే 1న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. నాని ఖాతాలో మరో హిట్ పడ్డట్లు తెలుస్తోంది. 

 

Read more Photos on
click me!

Recommended Stories