Ante Sundaraniki Review: ట్విట్టర్ టాక్... అదిరిపోయే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్, ఆ చిన్న లోపం కూడా లేకుంటే!

Published : Jun 10, 2022, 05:48 AM IST

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించారు. మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా హీరోయిన్ గా నటించిన అంటే సుందరానికీ ప్రోమోలు ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి ప్రేక్షకుల అంచనాలను ఎంత వరకు అందుకుంది, ట్విట్టర్ లో అంటే సుందరానికీ చిత్రం గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో చూద్దాం..

PREV
18
Ante Sundaraniki Review: ట్విట్టర్ టాక్... అదిరిపోయే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్,  ఆ చిన్న లోపం కూడా లేకుంటే!
Ante Sundaraniki Review

కథ
అంటే సుందరానికీ మూవీ కథ విషయానికి వస్తే సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సుందరం(నాని) బాల్యం నుండే ఆంక్షలు, కట్టుబాట్ల మధ్య పెరుగుతాడు. ఈ క్రమంలో ఒకింత కోరుకున్న జీవితం కోల్పోతాడు. సుందరానికి అమెరికా వెళ్లాలనేది గట్టి సంకల్పం. దీనికి కూడా తండ్రి ఆచారాల పేరుతో అడ్డుపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో సుందరానికి లీలా థామస్ (నజ్రియా) పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. లీలా క్రిస్టియన్ కావడంతో పాటు ఆమె పేరెంట్స్ వాళ్ళ మతపరమైన నమ్మకాల పట్ల చాలా స్ట్రిక్ట్. రెండు భిన్న మతాలకు చెందిన సుందరం, లీలా పెద్దలను ఒప్పించి తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు? అనేది మిగతా కథ... 

28
Ante Sundaraniki Review


నిజానికి ఇలాంటి కథతో తెలుగులో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. కథ పాతదే అయినప్పటికీ దర్శకుడు దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కొత్తగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఓ రొటీన్ కథకు దర్శకుడు వివేక్ రాసుకున్న స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని నెటిజెన్స్ అంటున్నారు.  
 

38
Ante Sundaraniki Review


లీడ్ పెయిర్ నాని, నజ్రియా నటన చాలా సహజంగా సాగిందని పలువురు నెటిజెన్స్ అభినందిస్తున్నారు. అలాగే నాని పేరెంట్స్ గా చేసిన నరేష్, రోహిణి, నజ్రియా పేరెంట్స్ గా చేసిన నదియా, అజగం పెరుమాళ్ ల నటన, క్యారెక్టరైజేషన్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. అద్భుత నటన కారణంగా ప్రేక్షకులకు నటులు కనిపించరు, కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. 

48
Ante Sundaraniki Review

దర్శకుడు వివేక్ ఆత్రేయ రైటింగ్ స్టైల్ ని అందరూ కొనియాడుతున్నారు. కామెడీ డైలాగ్స్, ఫ్యామిలీ సన్నివేశాలు, స్క్రీన్ ప్లే బాగున్నాయన్న మాట వినిపిస్తోంది. అలాగే నాని, నజ్రియా మధ్య లవ్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు ఆయన గొప్పగా తీర్చిదిద్దారు. వివేక్ సాగర్ సంగీతం బాగుంది అంటున్నారు. దర్శకుడు రాసుకున్న సన్నివేశాలకు వివేక్ సాగర్ బీజీఎం బలం చేకూర్చింది.

58
Ante Sundaraniki Review

ముఖ్యంగా అంటే సుందరానికీ సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు. క్లైమాక్స్ కూడా బాగా కుదిరింది. సుదీర్ఘ నిడివి కలిగిన కథను బోర్ కొట్టకుండా చెప్పకుండా చెప్పడంలో వివేక్ ఆత్రేయ చాలా వరకు సక్సెస్ అయ్యారు.

68
Ante Sundaraniki Review

ఇక అంటే సుందరానికీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే... ఫస్ట్ హాఫ్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. అసలు కథలోకి వెళ్ళడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నారు. స్లో నేరేషన్ కొంచెం నిరాశపరుస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్ ప్లాట్ గా సాగుతూ, ఆసక్తి కలిగించలేకపోయింది

78
Ante Sundaraniki Review


ఇక సినిమా లెంగ్త్ కూడా మరో మైనస్ అంటున్నారు. ఎడిటింగ్ కి పని చెప్పి కొంత నిడివి తగ్గిస్తే మరింత ఆకర్షణగా ఉండేది. ఫస్ట్ హాఫ్, స్లో నేరేషన్ సినిమా ఫలితాన్ని ఒకింత దెబ్బతీశాయి. ఇక ఎంత కొత్తగా చెప్పినప్పటికీ ఇది అనేక చిత్రాల్లో చూసిన పాత కథే. 

88
Ante Sundaraniki Review

చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ అంటే సుందరానికీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నెటిజెన్స్ అభివర్ణిస్తున్నారు. నాని, నజ్రియా లతో పాటు నటుల యాక్టింగ్, వివేక్ ఆత్రేయ రాసుకున్న కామెడీ, సన్నివేశాలు, రొమాన్స్ అలరిస్తాయని ప్రేక్షకులు అభిప్రాయం వెల్లడిస్తున్నారు. కాబట్టి ఈ వారం అంటే సుందరానికీ ప్రేక్షకుల బెస్ట్ ఛాయిస్ అంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories