Dasara Movie First Review: దసరా ఫస్ట్ రివ్యూ: నాని వన్ మాన్ షో, కీర్తి నుండి బిగ్ ట్విస్ట్... పుష్ప 2.0!

Published : Mar 28, 2023, 11:23 AM ISTUpdated : Mar 28, 2023, 11:49 AM IST

నాని హీరోగా తెరకెక్కిన దసరా మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు దసరా చిత్రంపై తన అభిప్రాయం తెలియజేశారు.

PREV
16
Dasara Movie First Review: దసరా ఫస్ట్ రివ్యూ: నాని వన్ మాన్ షో, కీర్తి నుండి బిగ్ ట్విస్ట్... పుష్ప 2.0!

హీరో నాని దసరా చిత్ర విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన కెరీర్ కి కూడా ఇది అవసరం. నాని పక్కా కమర్షియల్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఈ మధ్య కాలంలో విడుదలైన నాని చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ మాత్రమే పర్లేదు అనిపించింది. బ్రేక్ ఈవెన్ దాటి స్వల్ప లాభాలు పంచింది. లాస్ట్ రిలీజ్ అంటే సుందరానికీ డిజాస్టర్ రిజల్ట్ చవిచూసింది. నాని మార్కెట్ నే ప్రశ్నించిన చిత్రం అది. 
 

26

దీంతో దసరా విజయం నానికి లైఫ్ అండ్ డెత్ మేటర్. అందులోనూ ఇది పాన్ ఇండియా చిత్రం. హిట్ టాక్ తెచ్చుకుని రెండు మూడు భాషల్లో ఆడితే నాని రేంజ్ మారిపోతుంది. పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో జాయిన్ కావచ్చు. అందుకే చాలా అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కాంట్రవర్సియల్ కామెంట్స్ చేస్తున్నారు. కాన్ఫిడెన్స్ పేరుతో కొంచెం అతి చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. బహుశా సినిమాకు ప్రచారం దక్కించుకోవడంలో భాగంగా ఆయన ఈ యాటిట్యూడ్ అడాప్ట్ చేసుకొని ఉండొచ్చు.

36

కాగా దసరా చిత్ర ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. విడుదలకు రెండు రోజుల ముందే సినిమాకు పాజిటివ్ టాక్ దక్కింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు తన అభిప్రాయం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఆయన ఉద్దేశంలో దసరా మూవీ అద్భుతం. కలెక్షన్స్ దుమ్ము దులిపే చిత్రం. ఉమర్ సంధు దసరా చిత్రానికి 3.5/5 రేటింగ్ ఇచ్చారు. చెప్పాలంటే అది బ్లాక్ బస్టర్ రేటింగ్. 
 

46

ఉమర్ సంధు తన ట్వీట్లో... దసరా పైసా వసూల్ మాస్ ఎంటర్టైనర్. పాన్ ఇండియా రేసులోకి నాని దూసుకొచ్చాడు. దసరాలో నాని వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ తో మెస్మరైజ్ చేశారు. ఇక కీర్తి సురేష్ ఆటం బాంబులా పేలింది. యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పుష్ప 2.0... అంటూ పూర్తి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఉమర్ సంధు ట్వీట్ వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

56

మరి ఉమర్ సంధు అభిప్రాయంతో ఇండియన్ ఆడియన్స్ ఏకీభవిస్తారో లేదో తెలియాలంటే... విడుదల వరకు ఆగాల్సిందే. మార్చి 30న దసరా వరల్డ్ వైడ్ తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. దసరా చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ఉన్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

66
Dasara Movie Review

దసరా కథపై ఓ వాదన బలంగా వినిపిస్తోంది. స్నేహం, ప్రేమ, పగ అనే మూడు ప్రధాన ఎమోషన్స్ ఆధారంగా సాగుతుందట. దసరా రివేంజ్ డ్రామా అంటున్నారు. బలమైన ఎమోషన్స్ తో పాటు దుమ్మురేపే యాక్షన్ సన్నివేశాలతో దర్శకుడు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందించారని సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories