ఎపిసోడ్ ప్రారంభంలో తను చేసిన పాయసాన్ని తండ్రికి తినిపిస్తుంది ఖుషి. పాయసం చాలా బాగుంది పాయసం ఎలా వండాలో నా కూతుర్ని చూసి నేర్చుకోండి అంటూ వేదని చూసి చెప్తాడు యష్. ఈ మగవాళ్ళందరూ ఇంతే కూతురు కనిపించేసరికి తల్లి, పెళ్ళాలు కనబడరు అంటూ ఆట పట్టిస్తుంది మాలిని. అవును నా కూతురు గ్రేట్ అని మురిసిపోతాడు యష్.