నిలువద్దంలో శ్రద్ధా దాస్ బిగుతైన అందాల ప్రదర్శన.. మిర్రర్ సెల్ఫీలతో ఉలిక్కి పడేలా చేస్తున్న బన్నీ భామ..

First Published | Mar 28, 2023, 11:04 AM IST

గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ తన అందాల ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో ఫ్యాన్స్ ను మైమరిపిస్తోంది. లేటెస్ట్ గా శ్రద్ధా దాస్ పంచుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి.
 

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా ఎప్పుడో పరిచయం అయిన శ్రద్ధా దాస్ (Shraddha Das) ఇప్పటికీ  అలరిస్తూనే ఉంది. వెండితెరపై పెద్దగా అవకాశాలు లేకపోవడంతో బుల్లితెరపై సందడి చేస్తోంది. ఈ సందర్బంగా తన లేటెస్ట్ లుక్స్ తో మతులు పోగొడుతోంది. 
 

ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ15 షోతో శ్రద్ధా దాస్ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటూ తన ఫ్యాన్స్ కోసం క్రేజీగా పోస్టులు పెడుతోంది. తాజాగా శ్రద్ధా దాస్ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.
 


ఎప్పుడూ ఫొటోషూట్లతో ఫ్యాన్స్, నెటిజన్లను మైమరించే శ్రద్ధా దాస్ తాజాగా తన మిరర్రర్ సెల్ఫీలతో అందాల విందు చేసింది. బ్యూటీఫుల్ లుక్ తో గ్లామర్ డోస్ పెంచి మైండ్ బ్లాక్ చేసింది. స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాలను ప్రదర్శించింది. నిలువుటద్దం ముందు గ్లామర్ షో చేసింది.

ఎప్పుడూ ఫిట్ గానూ, చాలా గ్లామరస్ గా కనపించే శ్రద్ధా దాస్ ఏకంగా ఇలా పలుచని స్లీవ్ లెస్ టాప్ లో గ్లామర్ విందు చేయడంతో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శ్రద్ధా గ్లామర్ ఎటాక్ కు మైమరిచిపోతున్నారు. యంగ్ బ్యూటీ మత్తు పోజులకు చూపు తిప్పుకోవడం లేదనే చెప్పాలి.
 

బుల్లితెరపైనా తన అందాలతో ఆడియెన్స్ ను కట్టిపడేస్తున్న శ్రద్ధా దాస్ ఇలా సోషల్ మీడియాలోనూ స్టన్నింగ్ లుక్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ముంబైలోని జుహు ఏరియాలోని ఓ స్పా సెంటర్ కు వెళ్లిన సందర్భంగా ఇలా మిర్రర్ సెల్ఫీలకు ఫోజులిచ్చింది. 
 

శ్రద్ధా ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకోవడంతో.. తను అందం పట్ల ఎంతటి శ్రద్ధ వహిస్తారో అర్థం అవుతోంది. ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు ఆ తర్వాత అల్లు అర్జున్, ప్రభాస్, గోపీచంద్ సరసన కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. గ్లామర్ రోల్స్ లో మెరిసి ప్రేక్షకులను కట్టిపడేసింది. 
 

Latest Videos

click me!