కొన్నాళ్లుగా ప్రియాంక చోప్రా హాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారు. అక్కడ టెలివిజన్ సిరీస్లు, చిత్రాలు చేస్తున్నారు. 2017లో విడుదలైన బేవాచ్ మూవీలో ప్రియాంక కీలక రోల్ చేశారు. హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ డ్రామా పర్లేదు అనిపించుకుంది. ప్రస్తుతం ఆమె అధికంగా ఇంగ్లీష్ చిత్రాలు చేస్తున్నారు. హాలీవుడ్ లో పర్మినెంట్ గా సెటిలయ్యారు.