Intinti Gruhalakshmi: తులసి చేసిన పనికి సంతోషపడుతున్న నందు.. తులసిని చూసి కుళ్ళుకుంటున్న లాస్య?

First Published Feb 9, 2023, 9:17 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 9వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో లాస్య పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి కస్టమర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఎవరు రాలేదు అని నందు టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు లాస్య ఇక్కడున్న ప్రతి ఒక్కరికి చిలక్కు చెప్పినట్టు చెప్పాను. ఇక్కడ కేఫ్ పెట్టడం అంత కరెక్ట్ కాదని చెప్పాను కానీ నా మీద చాలెంజ్ విసిరారు అని వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటుంది లాస్య. ఇప్పటివరకు టైం వేస్ట్ చేసింది చాలు మూట ముళ్ళు సర్దుకుని ఇంటికి వెళ్దాం పదండి అని అంటుంది. అప్పుడు తులసి శుభం పలకవచ్చు కదా లాస్య అనడంతో పొద్దున్నుంచి అదే మాట చెబుతున్నావు కదా కేఫ్ అంతా కస్టమర్స్ తో కలకల లాడుతుందని చెప్పావ్ ఒక్కరైనా వచ్చారా అంటుంది లాస్య.
 

 అప్పుడు తులసి ఒక ఆలోచన వచ్చి ఇంట్లో వాళ్ళని అక్కడ ఉన్న సిట్లలో కూర్చొమని చెబుతుంది. మనం కస్టమర్స్ లా కూర్చోవడం ఏంటి అని అనగా నాకు కూడా అదే అర్థం కావడం లేదు అంటుంది అనసూయ. అప్పుడు నందు రెండు పానీపూరి బండ్లు పెడితే ఎక్కడికి వెళ్తారు అనడంతో జనాలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్తాము అంటుంది శృతి. అప్పుడు నందు కరెక్ట్, తులసి ప్లాన్ కూడా అదే అని అంటాడు నందు. అప్పుడు అనసూయ అర్థం అయింది రా మార్కెటింగ్ చదువుకుంటేనే కాదు ఆలోచన ఉంటేనే అని అంటుంది అనసూయ. ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క సీట్లు వెళ్లి కూర్చోగా కస్టమర్స్ బయట నుంచే చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు నందు కస్టమర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

 అప్పుడు తులసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కాఫీలు జ్యూస్ లు ఇస్తుంది. అప్పుడు అందరూ ఆ జ్యూస్లు తాగుతూ కస్టమర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు లాస్య పదేపదే వెళ్దాం వెళ్దాం అనగా ఇంట్లో ఏమైనా లంకె బిందెలు దాచావా కావాలంటే మేముంటాం నువ్వు వెళ్ళిపో అంటుంది అనసూయ. ఇంతలోనే ఇద్దరు కష్టమర్స్ రావడంతో నందు వాళ్లను లోపలికి పిలుచుకొని వెళ్లగా కస్టమర్స్ రావడంతో అందరి సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఆర్డర్ ఇవ్వడంతో ఏం చేయాలో తెలియక తులసి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ వంటవాడు నాకు ఎలా చేయాలో తెలియదు అనడంతో నందు వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు కస్టమర్స్ వెళ్లిపోతుండగా నందు అడ్డుపడి పర్లేదు కూర్చోండి ప్లీజ్ రెండు నిమిషాలు తయారు చేసి ఇస్తాను అని అంటాడు.
 

అయినా వాళ్ళు వినిపించుకోకుండా వెళ్ళిపోతుండగా తులసి వెనక్కి పిలిచి కూర్చోండి నేను సర్వే చేసి ఇస్తాను అని కిచెన్ లోకి వెళ్లి చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నందు తులసి ప్రేమ్ ముగ్గురు కలిసి వంట తయారు చేస్తూ ఉంటారు. అప్పుడు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు కస్టమర్స్ వాట్ ఇస్ దిస్ ఇది కిటోబర్గరా అని అనడంతో తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఊరగాయ పచ్చడి చేసుకో ఇలాంటివి నీకు సెట్ కావు అని వెటకారంగా మాట్లాడుతుంది లాస్య. అప్పుడు ఆ కస్టమర్స్ ఏమైంది బేబీ అనడంతో సూపర్ గా ఉంది అనడంతో నందు తులసి ఇద్దరు ఆనంద పడుతూ ఉండగా లాస్య షాక్ అవుతుంది. అప్పుడు కస్టమర్స్ మరిన్ని ప్యాక్ చేయండి అనడంతో తులసి వాళ్ళు సంతోషంగా ప్యాక్ చేస్తూ ఉంటారు.

తర్వాత చేసిన వంటకాలు చాలా బాగున్నాయి మళ్లీ మళ్లీ వస్తాము అని చెప్పి వెళ్లిపోవడంతో అందరూ సంతోషంతో చెప్పట్లు కొట్టి ఆనంద పడుతూ ఉంటారు. ఆ తర్వాత నందు అక్కడి పని వాళ్లకు పని చెబుతూ ఉండగా ఇంతలో గాయత్రి అక్కడికి వచ్చి అసలు నీ ప్రవర్తన ఏటో నాకు అర్థం కావడం లేదు నువ్వు అదృష్టవంతుడివో ఏంటో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. అప్పుడు నందు అదృష్టం అంటే ఆస్తి ఉండడం కాదు సంతోషంగా చేతినిండా పని ఉండడం కడుపునిండా భోజనం చేయడం అంటాడు. సమర్ధించుకోవడంలో కూడా బాగానే తులసి ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంది అని అంటుంది గాయత్రి. నువ్వు నేర్చుకున్నది మంచో చెడో కాలమే డిసైడ్ చేస్తుంది అని వెటకారంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గాయత్రి.
 

 తర్వాత దీపక్ నేను వెళ్లొస్తాను అక్క అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అందరు సంతోషపడుతూ లాస్య వెటకారంగా మాట్లాడిస్తుండడంతో వెంటనే పరంధామయ్య మాట అనే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడు అని అంటాడు. మా నాన్న మన కోసమే చెబుతున్నాడు ఎదురు తిరిగి మాట్లాడకుండా చెప్పింది విను లాస్య అంటాడు నందు. అప్పుడు హోటల్లో ఫుడ్ మిగిలిపోయింది అనడంతో ఇవాళ మనం ఇక్కడే తిందాము అని అంటాడు పరంధామయ్య. ఆ తర్వాత  తులసి అన్ని జరిగాయా లేదా అని చెక్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసే దగ్గర నుంచి లైట్స్ ఆఫీస్ చేసే వరకు ప్రతి ఒక్క విషయాన్ని దగ్గరుండి చూసుకోండి అని అంటుంది. మీ బాధ్యత కదా అనడంతో నువ్వు పక్కనే ఉంటావు కదా తులసి అని అంటాడు నందు.
 

 నేను ఉన్న లేనట్టే, నా పద్ధతులు నాకు ఉన్నాయి కదా అని అనగా అందులో నా బాధ్యత కూడా ఒకటి అనుకోవచ్చు కదా అంటాడు నందు. అప్పుడు మీ బాధ్యతలు పంచుకోవడానికి మీ భార్య లాస్య ఉంది అని అంటుంది తులసి. అప్పుడు నందు లాస్య పేరు ఎత్తగానే ముఖంలో సంతోషమంతా పోయి ముఖం ఒక లాగా పెడతాడు. ఈరోజు ఈ డబ్బులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని నందు  సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు తులసి నందు కి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంటికి వెళ్లిన తులసి కేఫ్ లో లాస్య అన్న మాటలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు పదేపదే లాస్య అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ కేఫ్ బాగా జరిగేలా చూసుకోవాలి జనాలు వచ్చేలా ప్రచారం చేయాలి అందుకోసం ఏం చేయాలి అనుకుంటూ ఉంటుంది తులసి. అప్పుడు తులసికి ఒక ఆలోచన రావడంతో పెన్ను పేపర్ తీసుకొని రాస్తూ ఉంటుంది.

click me!