మరొకవైపు సామ్రాట్, తులసి జరిగిన విషయాలు తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు సామ్రాట్ ఎందుకు వెనక్కి తగ్గారు అని అడుగుతాడు. మీ పిల్లలు మీకు దగ్గర అవడం ఇష్టం లేదా అనడంతో అలా అని వాళ్ళు నాన్నకు దూరమవ్వడం నాకు ఇష్టం లేదు అని అంటుంది తులసి. మోసం చేసి ఇంటిని తన పేరు మీదకు రాయించుకున్న లాస్యనే నందగోపాల్ గారు నమ్ముతున్నారు అంటే మీరు అతన్ని ఏ నమ్మకంతో నమ్ముతున్నారు అని అడుగుతాడు సామ్రాట్. తెలియదు సామ్రాట్ గారు అంతా అగమ్య గోచరంగా ఉంది అని తులసి ఆలోచనలో పడుతుంది. అప్పుడు సామ్రాట్ తులసికి నచ్చ చెబుతూ ఇప్పటికీ చాలా త్యాగాలు చేశారు మీ పద్ధతిని మార్చుకోండి అని అంటాడు.