Intinti Gruhalakshmi: అబద్ధంతో దివ్యని ఇరికించిన విక్రమ్.. కూతురి జీవితం ఏమవుతుందో అని భయపడుతున్న నందు?

Published : Apr 22, 2023, 08:46 AM IST

Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తనని అవమానించిన వ్యక్తిని కోడలుగా చేసుకొని ఆమె జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఒక అత్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Intinti Gruhalakshmi: అబద్ధంతో దివ్యని ఇరికించిన విక్రమ్.. కూతురి జీవితం ఏమవుతుందో అని భయపడుతున్న నందు?

ఎపిసోడ్ ప్రారంభంలో ప్రేమ్ దంపతులు వాళ్ళ ఊరు బయలుదేరడానికి సిద్ధమవుతారు. ఒక తల్లిగా నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండాలనిపిస్తుంది కానీ తప్పదు కదా అంటుంది తులసి. నాకు కూడా ఇక్కడే ఉండాలని ఉంటుంది. చాలాసార్లు ఉద్యోగం మానేద్దామని కూడా అనిపించింది అంటాడు ప్రేమ్. అలాంటి పని చేయకు నీ భవిష్యత్తుకి ఈ తల్లి ఎప్పుడు అడ్డు కాకూడదు. నీ అన్నయ్య.. పెళ్లికి రావడం కుదరలేదు. కనీసం నువ్వైనా వచ్చావు. లేకపోతే నీ చెల్లెలు జీవిత కాలం బాధపడేది అంటుంది తులసి. 

28

శృతి దగ్గరికి వెళ్లి నా కొడుకుని అమ్మ లాగా చూసుకుంటున్నావు సంతోషం అంటుంది. అమ్మ ప్రేమకి ఏది సాటి రాదు. ఆయన నన్ను రోజుకి నన్ను నాలుగు సార్లు అమ్మ అని పిలుస్తారు అంటుంది శృతి. నీకు ఏ అవసరం వచ్చినా, నీకు ఉండాలనిపించినా ఈ చిన్న కొడుకు ఉన్నాడని మర్చిపోవద్దు అంటాడు ప్రేమ్. మీ అమ్మ ఈ ఇల్లు వదిలి వెళ్ళవలసిన అవసరం ఎప్పటికీ రాదు నేను మాటిస్తున్నాను అంటాడు నందు. పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వచనం తీసుకొని బయలుదేరుతారు ప్రేమ్ దంపతులు. మరోవైపు తల్లిదండ్రులు తనని కలవకుండా వెళ్ళినందుకు బాధపడుతుంది దివ్య. అదే విషయాన్ని తల్లికి ఫోన్ చేసి అడుగుతుంది.
 

38

మీ అత్తగారు నువ్వు పడుకున్నావ్ అని చెప్పారు. అందుకే లేపడం ఇష్టం లేక వచ్చేసాము.. మాదే తప్పు ఈసారి వచ్చేటప్పుడు ఫోన్ చేసి వస్తాము అంటుంది తులసి. ఒకసారి గా షాక్ అయిన దివ్య.. నేను పడుకోలేదు నాకు మధ్యాహ్నం పూట పడుకునే అలవాటు లేదు నీకు కూడా తెలుసు కదా.. అత్తయ్య అలా ఎలా చెప్పేస్తారు అంటుంది దివ్య. చాలాసేపు గది నుంచి బయటికి రాకపోవటంతో అలా అనుకొని ఉంటారు. అయినా ఎలాగు రేపు వ్రతానికి వస్తాం కదా అక్కడ బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం అంటుంది తులసి. ఎదురు చూస్తూ ఉంటాను అంటూ ఆనందంగా ఫోన్ పెట్టేస్తుంది దివ్య. 

48

రాజ్యలక్ష్మి గారు అలా ఎలా చూడకుండా దివ్య నిద్రపోయిందని చెప్పారు అంటూ అనుమాన పడుతుంది తులసి. నిజం తెలిస్తే తట్టుకోలేవు. చేజేతులా మనమే మన పిల్లని నరకానికి పంపించాము అనుకుంటాడు నందు. బయటికి మాత్రం అబద్ధం చెప్పవలసిన అవసరం ఆవిడకి ఏముంది నిజంగానే దివ్య పడుకుందేమో అనుకుని ఉంటారు అంటూ తులసికి సర్ది చెప్తాడు నందు. మరోవైపు ఫస్ట్ నైట్ కోసం స్వీట్స్ తీసుకొని వస్తాడు విక్రమ్. ఏంటో నా ఫస్ట్ నైట్ కి నేనే అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అంటాడు. నేను అదే ఆలోచిస్తున్నాను. పెద్దమ్మ గారు అలా వదిలేసారేంటి అంటాడు దేవుడు.

58

ఇలాంటి చిన్న చిన్న విషయాలు అమ్మకు ఏం తెలుస్తాయి అంటాడు విక్రమ్. ఇప్పుడు ఈ స్వీట్స్ ని ఎవరికి కనిపించకుండా ఎలాగ పైకి తీసుకు వెళ్ళటం అంటాడు. ఇవి కారులోనే ఉండనివ్వండి.. ఎవరు చూడకుండా నేను పైకి తీసుకు వస్తాను అంటాడు దేవుడు. మరోవైపు విక్రమ్ కనిపించకపోవడంతో కంగారు పడుతుంది రాజ్యలక్ష్మి. దివ్య ఇంట్లోనే ఉందని తెలుసుకొని రిలాక్స్ అవుతుంది. ఇలా ఎన్ని రోజులు కంగారు పడతావు అంటాడు బసవయ్య. నా కొడుకు నేను గీసిన గీత దాటడు నాకు ఆ నమ్మకం ఉంది అంటుంది రాజ్యలక్ష్మి. అంతలోనే విక్రమ్ రావటంతో ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు బసవయ్య. 

68

దివ్య పువ్వులు తీసుకురమ్మంది అందుకే వెళ్ళాను అంటాడు విక్రమ్. అప్పుడే వచ్చిన దివ్య నేను ఎప్పుడు తీసుకు రమ్మన్నాను అనేసరికి దేవుడు, విక్రమ్ ఇద్దరూ కంగారు పడిపోతారు. రేపు పూజ ఎనిమిది గంటలకి త్వరగా లేవండి అలారం పెట్టుకోండి అంటుంది రాజ్యలక్ష్మి. అలారం ఎందుకు దివ్య ఉంటుంది కదా అంటాడు విక్రమ్. దివ్య నీ పక్కన ఎందుకు ఉంటుంది మీ ఇద్దరికీ ఫస్ట్ నైట్ ఈ రోజు కాదు దానికి కూడా ముహూర్తం ఉంటుంది అంటుంది రాజ్యలక్ష్మి. డీలా పడిపోయిన విక్రమ్ ని ఆట పట్టిస్తాడు బసవయ్య.

78

మరోవైపు రాజ్యలక్ష్మి పగతో దివ్యని కోడలుగా చేసుకుందని తులసికి చెప్తే మనశ్శాంతిగా ఉండలేదు అలానే చెప్పకపోతే నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను అంటూ బాధపడతాడు నందు. ఇంతలోనే అక్కడికి వచ్చిన తులసి ఎందుకు ఇలా ఉన్నారు ఏమైంది అని అడుగుతుంది. ఒకసారి తప్పు చేస్తే ఆ బాధ జీవితాంతం భరించాల్సి వస్తుంది అంటాడు నందు.
 

88

అందుకు బాధ్యత మనది. దేవుడిని నిందించకూడదు అంటుంది తులసి. తెలిసి పొరపాటు చేస్తే అనుకోవచ్చు కానీ తెలియకుండా పొరపాటు జరిగితే ఏం చేస్తాం అంటాడు నందు. తెలిసి పొడిచినా, తెలియక పొడిచినా అవతల మనిషి దక్కడు అంటుంది తులసి. తరువాయి భాగంలో దివ్య, విక్రమ్ క్లోజ్ గా ఉండడాన్ని చూసి భరించలేకపోతారు రాజ్యలక్ష్మి, బసవయ్య.

click me!

Recommended Stories