సినిమాలు వదిలిపెట్టి.. ఓయ్ సినిమా హీరోయిన్ షామిలి ఏం చేస్తోందో తెలుసా..?

Published : Apr 22, 2023, 08:41 AM ISTUpdated : Apr 22, 2023, 08:43 AM IST

తెలుగు ప్రేక్షకులకు బేబీ షామిలి గురించి ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. బేబీ షామ్లీకాస్తా హీరోయిన్ షామ్లీగా మారి.. సినిమాలుకూడా చేసింది. ఆతరువాతర సినిమాల నుంచి దూరం అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తనకు ఇష్టమైన రంగంలో స్థిరపడిందట. ఇంతకీ ఆమె ఏం చేస్తోంది...?   

PREV
16
సినిమాలు వదిలిపెట్టి.. ఓయ్ సినిమా హీరోయిన్ షామిలి ఏం చేస్తోందో తెలుసా..?

జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా గుర్తుందా..? అందులో హీరోయిన్ శ్రీదేవి తరువాత ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిన మరో పాత్ర బేబీ షామిలి.. సౌత్ సినిమాకు ఆమె పరిచయం అక్కర్లేని పేరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. తెలుగు,తమిళ, మలయాళ బాషల్లో.. దాదాపు 50 కి పైగా సినిమాలు చేసిన షామిలి.. ఆతరువాత సినిమా రంగాన్నే వదిలిపెట్టింది. 

26

shamili

ఓయ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది షామిలి. సిద్థార్ద్ హీరోగా నటించిన ఈమూవీ యూత్ ను బాగా అట్రాక్ట్ చేసింది.  సూపర్ హిట్ గా నిలిచింది. అయితే షామిలీ పాత్రలో చురుకుదనం లేకపోవడం.. గ్లామర్ పాత్ర చేయకపోవడంతో.. యంగ్ స్టార్స్ సరసనషామిలీకి పెద్దగా అవకాశాలు రాలేదు. 

36


கடந்த 2016ம் ஆண்டு விக்ரம் பிரபு நடித்த வீர சிவாஜி என்ற படத்தின் மூலம் தமிழில் ஹீரோயினாக அறிமுகமாகமானார். அதன் பின்னர் தமிழில் சொல்லிக்கொள்ளும் அளவிற்கு பட வாய்ப்புகள் அமையவில்லை. 

ఓయ్ సినిమా హిట్ అయినా.. అందులో  అంతో ఇంతో పేరు సిద్థార్ద్ కే వచ్చింది. షామిలి పాత్ర గుర్తుండిపోయేది అయినా.. యూత్ లు గుర్తింపు రాలేదు. ఇక ఈసినిమా తరువాత పెద్దగా ఇండస్ట్రీలో కనిపించలేదు షామిలీ. అఈమధ్య నాగశౌర్యతో కలిసి అమ్మమ్మగారిల్లు సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ.. ఆతరువాత అసలు వెండితెర నుంచి మాయమైపోయింది. తెలుగులో మళ్లీ ఆమె సినిమాలు చేయలేదు. 
 

46

ప్రస్తుతం షామిలీ ఏం చేస్తుందంటూ.. పలువరు సినీ ప్రియులు సెర్చ్ చేస్తున్నారు. అయితే ఆమె మళ్లీ సినిమాలు చేస్తుందా? అనే దానిపై తాజాగా ఓ సందర్భంలో  క్లారిటీ ఇచ్చారు షామిలి. ప్రస్తుతం పెయింటింగ్స్ పై గట్టిగా దృష్టి పెట్టింది షామిలి. పెయింటింగ్ చేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం. దాంటో ఆమె ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. అంతే కాదు.. క్లాసికల్ డాన్స్ లో కూడా షామిలికి ఇంట్రెస్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. 
 

56

తాజాగా ఆమె మాట్లాడుతూ.. నేను తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో దాదాపు 50కి పైగా సినిమాలు చేశాను. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేశా. కానీ, పెయింటింగ్స్ అంటే నాకు ప్రాణం... అందుకే  ఈ రంగంపై దృష్టిసారించి ప్రతిభను నిరూపించుకునేందుకు కృషి చేస్తున్నా.  అమెరికాకు వెళ్ళి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసకున్నాను అన్నారు షామిలి. 
 

66

ఇక  బెంగుళూరు, చెన్నైలలో జరిగిన పలు పెయింటింగ్‌ ఎగ్జిబిషన్లలో నా పెయింటింగ్స్‌ను ప్రదర్శనకు ఉంచా. త్వరలోనే చెన్నైలోనే సొంతంగా పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నా. మళ్ళీ సినిమాల్లో నటించే విషయంపై ఇంకా ఆలోచించలేదు. నా టార్గెట్ పెయింటింగ్ ఎగ్జిబిషన్. ఆ పనులు పూర్తయిన తర్వాత మళ్లీ నటిస్తానేమో.. చెప్పలేను అన్నారు షామిలి.  

click me!

Recommended Stories