నా మీద పడిన నిందని దాదా తనమీద వేసుకుని నీ మొగుణ్ణి రక్షించడమే జాలి కూడా లేకుండా వదినమ్మని బాధ పెడతావా అసలు ఆమెని అనడానికి నీకేం హక్కు ఉంది అంటాడు నీరజ్. నేను ఈ ఇంటి కోడల్ని అంటుంది మాన్సీ. మాన్సీ చెంప పగలగొడుతుంది శారదమ్మ. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకన్నా తనకే ఎక్కువగా ఉంది. అనుకీ, నీకు నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటూ మందలిస్తుంది శారదమ్మ. దీన్ని కొట్టినా ఒకటే ఆ గోడను కొట్టినా ఒకటే అంటూ మాన్సీని అసహ్యించుకొని పదండి మనకి కోర్టుకి టైం అవుతుంది అంటూ తల్లిని, వదినని తీసుకొని బయలుదేరుతాడు నీరజ్. మరోవైపు కోర్టుకు వచ్చిన ఆర్య ని చూసి కన్నీరు పెట్టుకుంటుంది అను.