ఈరోజు ఎపిసోడ్లో పరందామయ్య బ్యాక్ గ్రౌండ్ లో ఆమె మ్యూజిక్ ఏంటి, ఫోర్ గ్రౌండ్లో ఈ గెటప్ ఏంటి అని అడగడంతో కాఫీ ఇస్తూ ఆ స్టెప్పులు ఏంటి అని అనగా వెరైటీగా ఉందా మామయ్య అని అడగడంతో కాఫీ కూడా బాగానే ఉంటుందా? వెరైటీగా ఉంటుందా అని అనసూయ అడగగా ఈరోజు నుంచి ఇంట్లో ఏం చేసినా ఏది చేసినా కూడా వెరైటీగా ఉంటుంది. అంత లాస్య మాయ కనిపిస్తుంది అనడంతో వెంటనే శృతి కానీ గెటప్ మాత్రం తులసి ఆంటీ లాగా ఉంది అనగా కదా నువ్వు ఒక్కదానివే నా క్రియేటివిటీ గుర్తించావు థాంక్స్ అని అంటుంది. దాంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు పనుందామయ్య తులసి లాగా తయారవ్వడం కాదు తులసి లాగా కాఫీ ఇవ్వాలి అనడంతో అలాగే చేశాను కదా అని అంటుంది లాస్య.